పశ్చిమగోదావరి

జనవరి నుంచి వర్చ్యువల్ క్లాస్‌రూమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 12 : ఫైబర్ నెట్ సౌకర్యంతో జనవరి నుంచి వర్చ్యువల్ క్లాసులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాల వారీగా వర్చ్యువల్ క్లాస్ రూమ్ కింద విద్యాబోధన అందించేందుకు అవసరమైన స్టూడియోను ఏర్పాటుచేస్తామన్నారు. గూడెం జిల్లా పరిషత్ హైస్కూలును ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.10లక్షలు ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయన్నారు. బకింగ్ హామ్ కెనాల్ విస్తరణ నేపథ్యంలో నిరాశ్రయులవుతున్న 650 కుటుంబాలకు వెంటనే ఇళ్ళు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవన నిర్మాణానికి నిధులు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వ అనుమతి రాగానే టెండరు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. పెంటపాడు మండలంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో యానాలపల్లి - కె.పెంటపాడు - పడమరవిప్పర్రును కలుపుతూ బిటి రోడ్డుగా అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం రూ.1.10కోట్లు మంజూరు చేసిందన్నారు. అదే విధంగా భీమవరం - పెంటపాడు రోడ్డుకు రూ.20లక్షలు, కొమ్ముగూడెం సిసి రోడ్డుకు రూ.30లక్షలు, వీరంపాలెం సిసి రోడ్డుకు రూ.10లక్షలు, పట్టెంపాలెం రోడ్డుకు రూ.30లక్షలు మొత్తం రూ.2కోట్లు మంజూరయ్యాయన్నారు. కడకట్ల - పెదతాడేపల్లి పొలిమేర వరకు రూ.70లక్షలతో పుంత రోడ్డుకు నిధులు మంజూరయ్యాయన్నారు. పెంటపాడు డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సి ఎం ను ఆహ్వానించి కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. నల్లజర్ల - తాడేపల్లిగూడెం, భీమవరం - తాడేపల్లిగూడెం రోడ్లు అధ్వాన్నంగా తయారైనందున తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో బిజెపి నాయకులు పోతుల అన్నవరం, యెగ్గిన నాగబాబు, కర్రి ప్రభాకర బాలాజీ, నరిశే సోమేశ్వరరావు, కౌన్సిలర్ కోట రాంబాబు, వలవల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

వారానికి మూడు ప్రభుత్వ పాఠశాలల్లో
ఆకస్మిక తనిఖీలు: కలెక్టర్
ఏలూరు, అక్టోబర్ 12: వారానికి రెండుమూడు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, విద్యార్ధులకు అందించే సౌకర్యాలు సక్రమంగా ఉండేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖ పనితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్, హ్యాండ్‌వాష్, తాగునీరు, కిచెన్‌షెడ్స్ సక్రమంగా నిర్వహిస్తున్నది, లేనిది తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వచ్చేవారంలోగా 952 పాఠశాలల్లో కిచెన్‌షెడ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం గ్యాస్ మీదనే తయారుచేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పధకంలో విద్యార్ధులకు అందించే కోడిగ్రుడ్డులు నాణ్యతతోకూడినవి సకాలంలో అందించాలని ఏజన్సీ ప్రతినిధులను కలెక్టరు ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం జరిగే పదవ తరగతి పరీక్షలు ఏ స్కూల్‌లో చదివే విద్యార్ధులు ఆ స్కూలులోనే రాయాల్సి ఉంటుందని, అయితే టీచర్లు, ఇన్విజిలేటర్లు వేరే ప్రాంతాల నుండి వస్తారన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వ నిధులు సక్రమంగా సద్వినియోగం జరగటం లేదన్నారు. పాఠశాలలు సౌకర్యాలు సక్రమంగా లేకపోతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని ఆయన అన్నారు. సమావేశంలో డిఇఓ గంగాభవాని, డిఎఫ్‌ఓ రామకృష్ణ, డిప్యూటీ డిఇఓ విజయకుమార్, ఎంఇఓలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాష అమలుకు సిఎం చర్యలు ప్రశంసనీయం
* రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
ఏలూరు, అక్టోబర్ 12 : రాష్ట్రంలో తెలుగు భాష అమలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఇటీవల వివాహమైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) కుమార్తె లక్ష్మీహాస, అల్లుడు మనోజ్ సత్య సాయినాధ్‌లను గురువారం రాత్రి ఏలూరులో బుధ్ద ప్రసాద్ పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. పని ఒత్తిడి వలన వివాహ వేడుక రోజున రాలేకపోయానని, బుజ్జితో ఉన్న అనుబంధం వల్ల నేడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏలూరు రావడం జరిగిందని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష అభివృద్ధిపై చంద్రబాబు అనేక నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రతీ చోటా తెలుగు భాష ప్రాముఖ్యత పెరిగందని, విదేశీ ప్రతినిధులు వచ్చినా తెలుగులో వారి సంభాషణలు ట్రాన్స్‌లేషన్ చేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నారని, అంతేకాకుండా ఫ్రజలు కూడా తెలుగు అమలుకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. ఎక్కడైతే మాతృభాషఖు ప్రాధాన్యత పెరుగుతుందో అక్కడ సాంస్కృతిక వైభవం కూడా ఉట్టిపడుతుందని చెప్పారు. బడేటి కుటుంబంతో తమకు ఎంతో అనుబంధం ఉన్నదని ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక మంచి మిత్రుడుగా బుజ్జి తమ కుటుంబానికి సన్నిహితుడు అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కొట్టు మధు, అంబికా రాజా, ప్రముఖ నాట్యాచార్యులు కెవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.