పశ్చిమగోదావరి

వైభవంగా ఏనుగు సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, అక్టోబర్ 16: వీరవాసరం కాపు, తెలగ సంఘం ఆధ్వర్యంలో భేతాళ ఊరేగింపు (ఏనుగు సంబరం) సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. 141వ ఏనుగు సంబరం ఉత్సవాన్ని కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. వీరవాసరంలో గత 141 సంవత్సరాలుగా గ్రామ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది విజయదశమి అనంతరం ఈ ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి రోజుల్లో మూలా నక్షత్రం రోజున భేతాళ స్వామి ప్రతిష్టను వివాహం కాని యువకునిచే పూజలు జరిపించి ప్రస్తుతం ఉన్న ఏనుగు గుడిలో ఒక పళ్లెంలో మట్టిని ఉంచి కత్తిని నిలబెడతారు. అప్పటి నుండి నిత్యం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. సోమవారం గడ్డితో తయారు చేసిన ఏనుగుపై అంబారీని ఉంచి దాంట్లో భేతాళస్వామిని ప్రతిష్టించి ఏనుగును గ్రామంలో మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు ఊరేగిస్తారు. మేళతాళాలు, బాణాసంచా కాల్పులతో ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సంబరానికి గ్రామస్థులు ఎక్కడా ఉన్నా వస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే మంచినీరు అందించాలి
*జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు
ఏలూరు, అక్టోబర్ 16 : ఎన్‌టి ఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రజలంకదించే సురక్షిత మంచినీటిని ప్రభుత్వం నిర్ధేశించినధరలకు మాత్రమే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధితాధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొన్నాడ రవి మాట్లాడుతూ గ్రామంలోని టూరింగ్ పేటలో ఉన్న ఎన్‌టి ఆర్ సుజల స్రవంతి లో నిర్వాహకులు 20 లీటర్ల మంచినీటిని రెండు రూపాయలకు అందించాల్సి ఉంగా అయిదు రూపాయలు తీసుకుంటున్నారని దీనిపై ప్రశ్నించినప్పుడు ప్రతీ ఒక్కరూ అయిదురూపాయాలు తీసుకుంటున్నారు కాబట్టి తాము తీసుకుంటున్నామని సమాధానం చెబుతున్నారని జెసి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమగ్ర విచారణ చేసి జిల్లాలో ఎక్కడ ఎన్‌టి ఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రజలకు ప్రభుత్వం సూచించిన ధరలకే సురక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావును ఆదేశించారు. దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన ఇ వెంకట రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం కాల్వ వలన దెందులూరు, ద్వారకాతిరుమల వెళ్లే దారిలో పొలాలు ముంపునకు గురి అవుతున్నాయని కాల్వ గట్టు వెంబడి డ్రైనేజీ లేకపోవడం వలన పంచాయితీ డ్రైనేజీ నీరు పొలాల్లోకి వస్తున్నాయని తద్వారా పంట పొలాలు పాడే తాము నష్టపోతున్నామని చెప్పారు. దీనిపై పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ ఇని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మొత్తం జిల్లా నుండి 29 మంది తమ సమస్యలను ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టరు దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి సంబంధితాధికారులకు ఆదేశాలుజారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెసి-2 షరీఫ్, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి ప్రసాదరావు, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డి ఎంహెచ్ ఓ డాక్టర్ కె కోటేశ్వరి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కె శంకరరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి లాల్ అహ్మద్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, ఆర్ అండ్ బి ఎస్ ఇ నిర్మల, డి ఇవో గంగాభవానీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.