పశ్చిమగోదావరి

పోలీసుశాఖలో పేపర్‌లెస్ ఆఫీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 20: దేశంలోనే తొలిసారిగా జిల్లాలో పోలీసువిభాగంలో పేపర్‌లెస్ కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఇ-ఆఫీసు విధానాన్ని రాష్ట్ర డిజిపి జెవి రాముడు ప్రారంభించారు. తొలిదశలో జిల్లా పోలీసు కార్యాలయం, డిఎస్పీ కార్యాలయాలు, సిఐ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నారు. రానున్న రోజుల్లో ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు ప్రతిపాదించినట్లు డిజిపి రాముడు తెలిపారు. ఈవిధానం వల్ల కాగితాలతో కూడిన ఫైళ్ల రాకపోకలు ఉండవని, ఆన్‌లైన్‌లోనే ఫైళ్లను పరిశీలించటం, పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల ఫైళ్ల పరిష్కారం పారదర్శకంగాను, త్వరితంగాను జరుగుతుందని వివరించారు. న్యూఢిల్లీకి చెందిన ఎన్‌ఐసి ఈ విధానాన్ని రూపొందించిందని తెలిపారు. ప్రతి ఉద్యోగి, అధికారులకు డిజిటల్ టోకెన్‌లను జారీ చేసినట్లు వివరించారు. అలాగే సిబ్బందికి శిక్షణ కూడా అందించామని వివరించారు. ఈసందర్భంగానే స్ధానిక పోలీసులైన్స్‌లో ఉన్న సురేష్‌చంద్ర బహుగుణ పోలీసు ఇంగ్లీషు మీడియం పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. హెచ్‌పిసిఎల్ సౌజన్యంతో నిర్మించిన ఈ తరగతి గదులను పూర్తిస్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా డిజిపి రాముడు పాఠశాల విద్యార్ధినీవిద్యార్ధులతో కొద్దిసేపు ఉల్లాసంగా గడిపారు. వారితోపాటు తరగతి గదుల్లో బెంచీలపై కూర్చొని వారితో ముచ్చటించారు. అదేవిధంగా పోలీసులైన్స్‌లో పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన జిమ్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే ఐటి కోర్ సెంటర్‌ను ప్రారంభించారు. దీంతోపాటు పోలీసు ఎఫ్‌ఎం రేడియో 88.7ను కూడా డిజిపి ప్రారంభించారు. జిల్లాలో తొలిసారిగా కమ్యూనిటీ పోలీసింగ్ నిమిత్తం ఎఫ్‌ఎం రేడియోను ప్రారంభించినట్లు డిజిపి తెలిపారు. దీనిద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలు తెలియపర్చవచ్చునని వివరించారు.
ఈసేవలు అన్నివేళలా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతానికి ఏలూరులో ఎఫ్‌ఎం రేడియో సేవలు అందుబాటులో ఉంటాయని, రానున్నరోజుల్లో దీనిని జిల్లావ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. కార్యక్రమాల్లో కోస్తా జిల్లాల ఐజి విశ్వజిత్, ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అదనపు ఎస్పీ ఎన్ చంద్రశేఖర్, డిఎస్పీలు కెజివి సరిత, అమరనాధనాయుడు, కె వెంకట్రావు, బి చంద్రశేఖర్, పడాల భాస్కర్, విజయపాల్, ఎం సుధాకరరావు, భాస్కరరావు, ఎఆర్ ఓఎస్‌డి డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.