పశ్చిమగోదావరి

రైతన్నకు వాయుగండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, నవంబర్ 17: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందుతుందో లేదోనని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు రెండు తుపాన్లు దాటిపోయినా, ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తుండడంతో రైతుల్లో గుబులేర్పడుతోంది. ఈ సార్వా పంట కొన్నిచోట్ల తెగుళ్లుసోకి కొంతమేర నష్టపోతున్నప్పటికీ చాలాచోట్ల పంట బాగానే పండిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగా నాట్లువేసిన చేలు కోతకు రావడంతో వర్షం వస్తే పంటంతా నష్టపోతామన్న భయంతో ఎక్కువ కూలి ఇచ్చి మరీ మాసూలు చేయిస్తున్నారు. తీరా చేలల్లోంచి గట్టుకు చేరుకున్న ధాన్యం రోడ్లపైనే ఎదురుచూస్తోంది. ఎంతో కష్టపడి మాసూలుచేసి గట్టుకు చేర్చిన ధాన్యాన్ని వ్యాపారులు గానీ, ప్రభుత్వం గానీ కొనేందుకు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలుచేయకపోతే పంట చేలో ఉన్నా, రహదారుల పక్కన ఉన్నా తడిసి పాడైపోతుందని ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలుచేయాలని రైతులు కోరుతున్నారు.