పశ్చిమగోదావరి

ప్రతీ ఇంటికీ మోదీ సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, నవంబర్ 21: నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా మహిళా మోర్చా కార్యకర్తలు కృషిచేయాలని పీఎమ్మార్ ట్రస్టు ఛైర్‌పర్సన్ పైడికొండల సింధు పిలుపునిచ్చారు. స్థానిక మంత్రి కార్యాలయంలో మంగళవారం మహిళామోర్చా అధ్యక్షురాలు ధనలక్ష్మిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సింధు మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళల సమస్యలపై సర్వే చేసి వాటి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళా మోర్చా మరింత కీలకపాత్ర పోషించాలన్నారు. జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ పడావో...్భటీ బచావో.., సుకన్య సమృద్ధియోజన వంటి పథకాలు బాలల సంక్షేమానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలో మంత్రి మాణిక్యాలరావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలపడంతోపాటు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ బీజేపీ ప్రతిపక్ష నేత యెగ్గిన నాగబాబు, బీజేపీ పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, బీజేపీ నేతలు ఖండభట్టు శ్రీనివాసరాజు, అయినం బాలకృష్ణ, శీతాళం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా అభివృద్ధికి ప్రభుత్వ సహకారం
-ప్రపంచ మత్స్య దినోత్సవ సభలో మంత్రి పితాని
ఏలూరు, నవంబర్ 21: రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగంలో అధికోత్పత్తులు, ఆదాయం పెంపొందించుకునే విధంగా ప్రభుత్వం తన వంతు పూర్తి సహకారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయ రంగాన్ని ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ, ఎంపి మాగంటి బాబు, జడ్పీ ఛైర్మన్ బాపిరాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పితాని మాట్లాడుతూ 1997 సంవత్సరంలో 18 దేశాలు కలిసికట్టుగా మత్స్యకారుల దినోత్సవం ప్రకటించడం జరిగిందని, అప్పటి నుండి మత్స్యకారుల దినోత్సవాన్ని జరుపుతున్నారన్నారు. మత్స్యకారులకు రక్షణ కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. మత్స్యకారుల కుటుంబాల్లో 50 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేసే విషయంపై ప్రభుత్వంతో చర్చించి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2016-17 సంవత్సరంలో జిల్లాలో 8.27 లక్షల టన్నుల మత్స్య సంపదను ఉత్పత్తి చేయగా, రూ.110.77 కోట్ల ఆదాయం లభించిందని, 2017-18 సంవత్సరంనకు 10.50 లక్షల టన్నుల ఉత్పత్తి , రూ.1571 కోట్ల ఆదాయం లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 7.65 లక్షల టన్నుల ఉత్పత్తి ద్వారా రూ. 114 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 2029 నాటికి 49 లక్షల టన్నులు మత్స్య రంగం అభివృద్ధి చేసి ఉత్పత్తులను పెంచేందుకు చర్యలుచేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని మత్స్యసంఘాలతో రెండు నెలల్లో సమీక్షలు నిర్వహించి మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కొల్లేరు కాంటూరు సమస్యపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున చట్టానికి లోబడి అధికారులు రాజకీయ ప్రతినిధులు తటస్థంగా ఉన్నారన్నారు. కొల్లేరు సమస్య తీవ్రతను గుర్తించి కేబినెట్‌లో సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. మత్స్యకారుల పిల్లల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేస్తున్నామని ఇందునిమిత్తం జీవో విడుదలైందని, నరసాపురం మండలంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గృహ నిర్మాణాల కొరకు మత్స్యకారులకు ప్రత్యేక కోటాలో ఇళ్లు ఏర్పాటు చేస్తామని ఉన్నతమైన ఆర్దిక స్థితి పొందేందుకు మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు కాంటూరు కుదింపు సమస్యపై ప్రభుత్వంతో సమీక్షిస్తామన్నారు. కొల్లేరుకు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేస్తామని ఇందునిమిత్తం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలో 974 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతంలో ఉందని గుజరాత్ తర్వాత మన రాష్టమ్రే ఇంత కోస్టల్ ప్రాంతం ఉన్నదని చెప్పారు. సుమారు 50 వేల మంది రాష్ట్రంలో మత్స్యకారులు తమ వృత్తిలో జీవనం సాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మత్స్యకారుల అభివృద్దికి సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు. వృత్తి పరమైన ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తదితర సామాగ్రిని ఎక్కువ సబ్సిడీతో అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలో మత్స్యకారులకు వివిద కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న రుణాలు, సబ్సిడీలను మత్స్యకారుల అభివృద్ధి కొరకు అందజేయడం జరుగుతుందని, 2017-18కు షెడ్యూల్డు కులాల కాంపోనెంట్ కింద మూడు చక్రాలు, నాలుగు చక్రాల ఆటో, ఐస్ బాక్సులతో ట్రాన్స్‌పోర్టు చేసుకునేందుకు సుమారు 50 మందికి 90 లక్షల రూపాయల విలువ గల ఉపకరణాలను మంత్రి పితాని అందజేశారు. దీనిలో ఒక్కొక్క నాలుగు చక్రాల వాహనం ఖరీదు 15 లక్షలు కాగా, సబ్సిడీ 7.50 లక్షలు, లబ్ధిదారుని వాటా 7.50 లక్షలు కింద వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్‌లేటెడ్ ట్రక్కును నరసాపురం మత్స్యకారుడు కొల్లాడ ఆదినారాయణకు మంత్రి చేతులు మీదుగా వాహనం తాళంను అందజేశారు. తొలుత జడ్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మత్స్యశాఖకు సంబంధించిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. వివిధ మత్స్యకార సొసైటీలతో మాట్లాడుతూ జిల్లాలోని కోస్టల్ ప్రాంతాల్లో మత్స్యకార వృత్తిలో ఉన్న వారందరినీ ప్రభుత్వం సత్వరమే ఆదుకునేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎజెసి ఎంహెచ్ షరీఫ్, మత్స్యశాఖ జెడి డాక్టర్ ఎస్ అంజలి, గణపవరం ఫిషరీస్ ఎడి తిరుపతయ్య, జాతీయ మత్స్యకారుల సొసైటీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, మత్స్యసంఘం ఉపాధ్యక్షులు బొమ్మిడి మధుసూధనరావు, జడ్పీటిసిలు మధు, చలపతి, మత్స్యకారుల సలహా సంఘ సభ్యులు సైదు సత్యనారాయణ, కోస్టల్ తీర ప్రాంత మత్స్యకారులు, మత్స్యకార సొసైటీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పంట ఎండింది..కడుపు మండింది...
టి నరసాపురం, నవంబర్ 21: నెలకు వేల రూపాయలు జీతాలు, అలవెన్సులు పొందుతూ లంచం కోసం ట్రాన్స్‌కో అధికారి వేధింపులకు ఒక రైతన్న తన రెక్కల కష్టాన్ని నష్టపోయాడు. మెట్ట ప్రాంతమైన టి.నరసాపురంలో వ్యవసాయానికి బోరులే ఆధారం. ఆ బోరు నుండి నీటిని తోడాలంటే విద్యుత్ ప్రాణాధారం. అలాంటి విద్యుత్ సరఫరాచేయడానికి అవసరమైన స్తంభం పడిపోతే కొత్తది వేయమని కోరిన రైతును లంచం కోసం వేధించడం ప్రారంభించాడు ఆ అధికారి. చివరకు పంట ఎండిపోవడానికి కూడా కారకుడయ్యాడు. ప్రాణం కంటె మిన్నగా సాగుచేసే పంట ఎండిపోతుండటంతో దిక్కుతోచక మళ్లీ వచ్చిన రైతుతో లంచం కోసం బేరసారాలు సాగించాడు. కడుపుమండిన ఆ రైతన్న అవినీతి నిరోధక శాఖ అధికార్లను ఆశ్రయించడంతో ఎనిమిది వేలు లంచం తీసుకుంటూ టి.నరసాపురం మండల ట్రాన్స్‌కో ఏఈ బి వెంకటేశ్వరరావు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
మండలంలోని శ్రీరామవరానికి చెందిన రైతు బీరం శోభనాద్రి కొత్త విద్యుత్ స్తంభం కోసం గత కొన్ని రోజులుగా తిరుగుతున్నా లంచం ఇవ్వకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. లంచం ఇవ్వని శోభనాద్రి పొలానికి విద్యుత్ సరఫరా జరగని విధంగా వైర్లను వేరుచేసి, ఆ తర్వాతి పొలం రైతులకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాడు సదరు ఏఈ. దీనితో శోభనాద్రి వరిచేను ఎండిపోవడం మొదలయ్యింది. నీటి తడి లేక నిమ్మతోట పిందెలు రాలిపోవడం ప్రారంభమయ్యింది. చివరకు రూ.8000 లంచం ఇవ్వడానికి అంగీకరించిన శోభనాద్రి ఎసిబి అధికార్లను ఆశ్రయించడంతో ఏఈ పాపం పండింది. మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో విద్యుత్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ బృందానికి దొరికిపోయాడు. ఏఈ వెంకటేశ్వరరావుపై కేసు నమోదుచేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ విల్సన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు శోభనాద్రి విలేఖర్లతో మాట్లాడుతూ తాను లంచం ఇవ్వలేదని తమ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న వైర్లు తొలగించి పైన ఉన్న రైతులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని వివరించారు. తన భూమికి నీరందక చేతికి వచ్చిన వరి పంట ఎండిపోయిందని, తడులు లేక నిమ్మతోటలో కాయలు రాలిపోయాయని వాపోయాడు. విసుగు చెంది తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించానని తెలిపాడు. ఈదాడిలో ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు.