పశ్చిమగోదావరి

ఏలూరు నగరపాలక సంస్థ కమిషనరుగా మోహనరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 23 : ఏలూరు నగరపాలక సంస్థ కమిషనరుగా ఎ మోహనరావు గురువారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనరు ఛాంబరులో ఇన్‌ఛార్జ్ కమిషనర్ రాంబాబు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌లోని అధికారులు, ఉద్యోగులు కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోహనరావు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్దికి కష్టపడి పనిచేస్తానని ముఖ్యంగా ఏలూరు స్మార్ట్ సిటీ నిర్మాణంతోపాటు ఏలూరు అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన పధకాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ను కలుసుకున్నానని ఏలూరు నగరాభివృద్ధికి పలు సలహాలు సూచనలిచ్చారని వాటిని ఖచ్చితంగా అమలు చేసి ఏలూరు నగర అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని చెప్పారు. మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబుల ఆదేశాలు మేరకు ఏలూరు నగరాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పెదబాబు మోహనరావుకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ పులి కుమార్, మేనేజరు మూర్తి, సూపరింటెండెంట్ మురళీ కృష్ణ, డి ఇ నెరుసు కొండలరావు, గాంధీ, అకౌంటెంట్ లింగేశ్వరి, డ్రాఫ్ట్స్‌మన్ రంగారావు, రవి, కార్పొరేటర్లు ప్రతాప్, గోపి తదితరులు పాల్గొన్నారు.
చొదిమెళ్ల చోరీ కేసులో నలుగురు అరెస్టు
*బంగారు, వెండి వస్తువులు, కారు, లారీ సీజ్
ఏలూరు, నవంబర్ 23 : జిల్లాలో సంచలనం సృష్టించిన పట్టపగలే జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి కూతవేటు దూరంలో వున్న చొదిమెళ్ల గ్రామంలో జరిగిన చోరీలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు ఏలూరు మండలం చొదిమెళ్ల గ్రామంలోని లక్ష్మీ గణపతి నగర్‌లోని నాల్గవ రోడ్డులో ఒక వృద్ధురాలిని నలుగురు వ్యక్తులు భయపెట్టి బంగారం, వెండి వస్తువులను అపహరించుకునిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని చోరీ జరిగిన 15 రోజుల్లోనే వారిని అరెస్టు చేసి రికవరీ కూడా చేసినట్లు తెలిపారు. ఈ చోరీకి పాల్పడింది తమిళనాడు రాష్ట్రం అరకోణం తాలూకా వేలూరు గ్రామానికి చెందిన సయ్యద్ అబ్బాస్, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలూకా పెరియార్ నగర్‌కు చెందిన సోమ సుందరం సుబ్రహ్మణ్యన్ అలియాస్ సోము, అదే గ్రామానికి చెందిన వీరవల్లి ముఖేష్ అలియాస్ నాగూర్ మీరావలీ, తమిళనాడు అరకోణం తాలూకా వేలూరుకు చెందిన సిలంబర్సన్ అలియాస్ సిలంబు అనే వ్యక్తులు వృద్దురాలిని బెదిరించి హతమారుస్తామని ఆమె నోటీకి ప్లాస్టర్ అంటించి అరవకుండా చేసి కుర్చీకి కట్టివేసి ఆమె వద్ద వున్న బంగారు వస్తువులతోపాటు బీరువాలో వున్న బంగారం, వెండి వస్తువులు కూడా వీరు అపహరించుకుని పోయారని తెలిపారు. ఈ కేసును ఏలూరు డి ఎస్‌పి కె ఈశ్వరరావు పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సర్కిల్ ఇన్‌ఛార్జి భీమడోలు సి ఐ బి ఎన్ నాయక్, ఏలూరు టుటౌన్ సి ఐ మధుబాబుల సహాయంతో మధ్యవర్తుల సమక్షంలో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద వున్న బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ జరిగిన నాడు ఉపయోగించిన స్కార్పియో కారును, అందుకు సహకరించిన ఒక లారీని కూడా సీజ్ చేశామని తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న ఆస్థి సుమారుగా 4.50 లక్షల రూపాయల విలువ వుంటుందని తెలిపారు. విలేఖరుల సమావేశంలో డి ఎస్‌పి కె ఈశ్వరరావు, రూరల్ ఎస్ ఐ కె నాగేంద్ర ప్రసాద్, ఎ ఎస్ ఐ మక్బూల్, హెచ్‌సి దిలీప్, పిసి రఫీ, బాజీ తదితరులు పాల్గొన్నారు.