పశ్చిమగోదావరి

గూడు లేని పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 23 : పచ్చని జిల్లా పశ్చిమగోదావరి... గ్రామ స్వరాజ్యమే దేశాభివృద్ధికి మార్గమనే తరహా ప్రకటనలు నాయకుల నోటి వెంట వింటూనే వుంటాం... అయితే వాస్తవానికి వచ్చే సరికి మాత్రం ప్రకటనల స్థాయి వ్యవహారం మాత్రం ఎక్కడా కనిపించదు. జీవ నదిని పేరులోనే పొందుపర్చుకున్న పశ్చిమగోదావరి వరి ప్రదాయినిగానే చెప్పుకోవచ్చు. అలాంటి జిల్లాలో పంచాయితీలు అంటే మరింత బలోపేతంగాను, అంతకుమించిన పలుకుబడితోనూ వుంటాయన్నది కూడా బహిరంగ రహస్యమే. అలాంటి జిల్లాలో ఈ పంచాయతీలు సొంత గూడు లేక అల్లాడిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యాలయాలు సర్పంచ్‌ల ఇళ్లలోనే అనధికారికంగా నడిచిపోతున్నాయంటే ఆశ్చర్యం కాదు. కొన్ని పంచాయతీలను చూస్తే అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అధికారం చెలాయించడం తెలిసిందే. ఇలా జిల్లా నుంచి లబ్ధప్రతిష్టులైన నేతలంతా పంచాయతీల కేంద్రంగానే ముందుకు వెళ్లారు. ఇలాంటి జిల్లాలో పంచాయతీలకు సొంత భవనాలు కూడా లేక ఆపంచనా, ఈ పంచనా కాలం గడిపేస్తున్నాయి. మేజర్ పంచాయతీల సంఖ్య జిల్లాలో భారీ సంఖ్యలోనే వున్నా అలాంటి చోట కూడా సొంత భవనం అన్నది మచ్చుకైనా కానరాదు. ఇక కొన్ని పంచాయతీలకు సొంత భవనాలు వున్నా అవి పురాతన కాలంలో పంచాయతీలు ఆవిర్భవించిన తొలి కాలంలో నిర్మించినవి కావడంతో అవన్నీ పూర్తిస్థాయి శిధిలావస్థకు చేరిపోయాయి. నేడో, రేపో అన్నట్లుగా మారిన ఈ భవనాల్లోనే ఆ పంచాయతీలు సగర్వంగా కొనసాగిపోతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో జిల్లా యంత్రాంగం ప్రతిపంచాయతీకి సొంత భవనం ఉండాలన్న లక్ష్యంతో బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రకారమే గత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 160కి పైగా పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు పరిపాలనామోదాల ప్రక్రియ కూడా పూరె్తైంది. అయినప్పటికీ ఇంత వరకు నిర్ధేశించుకున్న లక్ష్యంలో స్వల్ప శాతం కూడా పూర్తి కాలేదంటే అతిశయోక్తి కాదు. వీటిలో 14 భవనాలు ఇప్పటికే పూరె్తై ప్రారంభం కాగా 39 భవనాలు పూరె్తైనప్పటికీ వాటిని ఇంకా ప్రారంభించలేదు. మరో 21 భవనాలు నిర్మాణం రూప్ లెవెల్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇక 2017-18 ఆర్ధిక సంవత్సరంలో 24 పంచాయతీ భవనాలను మంజూరు చేయగా నేటి వరకు ఒక్కటి కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఈ నిర్మాణ పనులను ప్రభుత్వ శాఖకే అప్పగించినా పనులు ముందుకు వెళ్లడంలో మాత్రం తాబేలుతో పోటీపడుతున్నట్లే కనిపిస్తోంది. కొన్ని చోట్ల మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిర్మాణాలను ఆలస్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పార్టీల మధ్య వున్న వైరుధ్యాలు, అవే పార్టీలో వున్న గ్రూపులు వంటివి కూడా నిర్మాణ పనులు ముందడుగు పడటంలో గట్టి ప్రభావమే చూపుతున్నట్లు కనిపిస్తోంది. పలానా చోట కట్టాలంటే ఒక గ్రూపు వ్యతిరేకిస్తుంటే మరో గ్రూపు పట్టుబడుతుండటం, మరో చోట అంటే మళ్లీ అదే పరిస్థితి ముందుకు రావడంతో చివరకు మొత్తం నిర్మాణానే్న పెండింగ్‌లో పెట్టేసే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక మరో కోణం కూడా దీనిలో ప్రచారం జరుగుతోంది. నిర్ధేశిత మొత్తంలో పంచాయితీ భవనాలను నిర్మించాలని తలపెట్టిన సమయం నాటి ధరలకు ఇప్పటికీ వ్యత్యాసం రావడంతో మరికొంతకాలం వేచి చూస్తే మొత్తం ధరవరలను మార్పు చేసే పరిస్థితి వస్తుందని, ఆ తరువాత అయితే నాలుగు రాళ్లు మిగులుతాయన్న ఉద్దేశ్యంలో కొన్ని చోట్ల వీటిని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా అన్ని హంగులు వున్న పశ్చిమగోదావరి వంటి జిల్లాలోనూ 90 శాతం పంచాయతీలు సొంత గూడు లేకుండా కునారిల్లుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
వీటికి తోడు పంచాయతీ పరిపాలనను బలోపేతం చేయడమే కాకుండా మరింత పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో జిల్లా యంత్రాంగం పంచాయతీ కార్యాలయాలను మినీ మీ-సేవ కేంద్రాలుగా మార్చాలని తాజాగా నిర్ణయించడం కొంత భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. వాటిని అలా ఉంచితే సొంత గూడు, సొంత నిర్మాణాలు లేకుండా ఎటువంటి ప్రాధమిక వసతులు కూడా లేని ప్రస్తుత పంచాయతీ కార్యాలయాల్లో ఈ మినీ మీ-సేవ కేంద్రాలు ఎలా సాధ్యమన్న మీమాంస కూడా మొదలైంది.
డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తాం
*మార్చి తరువాత నీరిచ్చే పరిస్థితి లేదు*డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తిచేయాలి: మంత్రి పితాని
ఆచంట, నవంబర్ 23:డెల్టా ఆధునికీకరణ పనులు ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని, కాబట్టి మురుగుకాలువలు, డ్రెయిన్లు పనులు జరగాలంటే డిశంబరు 31 నాటికి దాళ్వానాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖా మంత్రి పితాని సత్యనారాయణ కోరారు. గురువారం ఆచంటలో నియోజకవర్గస్థాయిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతురథం పథకంలో రైతులకు ట్రాక్టర్లు, పవర్‌టిల్లర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బీర తిరుపతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు సాగు వలన ప్రకృతి విపత్తుల నుండి తప్పించుకోవచ్చనేది ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. అయితే ఇటీవల వేసిన సార్వాపంట స్వర్ణ మినహా మిగిలిన పంటలు దిగుబడి బాగా తగ్గిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈవిషయంలో శాస్తజ్ఞ్రులు, వ్యవసాయాధికారులు వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎంటియు 1229రకం 150 రోజులకే కోతకు వస్తుందని శాస్తజ్ఞ్రులు ప్రకటించడంతో రైతులు ఎక్కువగా వేశారని అయితే ఈపంట కాలం 175 రోజులు దాటిపోతుండడంతో రైతాంగం నష్టపోతున్నారని అన్నారు. కాగా దాళ్వాలో 1121 రకం మంచిరకంగా శాస్తజ్ఞ్రులు చెబుతున్నారని, వీటి తరువాత 1153, 1156 రకాలు విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రి పితాని తెలిపారు. డిశంబర్ 31 నాటికి నాట్లుపూర్తిచేయలేకపోతే జనవరిలో ఇన్‌ఫ్లో ఉన్నప్పటికి ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బాగా తగ్గిపోతుందని కాబట్టి ముందస్తుసాగుకు రైతులు సహకరించాలని కోరారు. రైతాంగానికి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. గోదావరి నీళ్ళు రాష్ట్ర ప్రజలకు సంజీవిని లాంటివని ముఖ్యమంత్రి అంటున్నారని, అయితే ప్రతిపక్షాలు పోలవరం పై లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయని అన్నారు.