పశ్చిమగోదావరి

ఓర్వలేకే ప్రభుత్వంపై జగన్ విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఏదో విధంగా అడ్డుకోవడానికి వైసిపి నేత జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇంతటి దుర్మార్గమైన చర్యలకు రాష్ట్రంలోనే జగన్మోహన్‌రెడ్డి తప్ప మరెవ్వరూ పాల్పడరన్నారు. మండలంలోని జానంపేట వద్ద నిర్మిస్తున్న పోలవరం కుడికాలువ అండర్ టనె్నల్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పట్టిసీమ పూర్తిచేశామని, పోలవరం కుడికాలువ పనులు పూర్తవుతున్నాయని, ఎడమ కాలువ పనులు వచ్చే ఏడాదికి పూర్తిచేయడానికి ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. తోటపల్లి పథకం ద్వారా 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చామని, ఈ ఏడాది మరో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వంశధార ఫేజ్-1, 2 పనులకు టెండర్లు పిలిచామని, నిర్వాసితుల సమస్యలు పరిష్కృతం అవుతున్నాయన్నారు. వంశధార, నాగావళి అనుసంధానం అవుతుందన్నారు. పోలవరం పనుల్లో జర్మనీ బవర్ ఎల్ అండ్ టి వారు శానిడిస్క్‌నేషన్ పనులు పూర్తవుతున్నాయన్నారు. పనులు జరుగుతుండటాన్ని ఓర్వలేని జగన్ ఏదో విధంగా ప్రభుత్వంపై బుదర చల్లాలనే దృక్పధంతో వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి పనులు జరగడం లేదని, ఇటీవల కాలంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టిడిపిలోకి రావడాన్ని తన సొంత ఇంటికి వచ్చినట్లుగా అభిప్రాయపడుతున్నారని, వైసిపిలో ఆత్మవంచన చేసుకుని పనిచేసినట్లుగా నెహ్రూ పేర్కొన్నారన్నారు. వైసిపి మనుగడ కోసం జగన్ ఇటువంటి దుష్ప్రచారాలు, బురద జల్లడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి దేవినేని విమర్శించారు.