పశ్చిమగోదావరి

నిర్వాసితులను అన్ని విధాల ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జనవరి 20: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులను అన్ని విధాల ఆదుకోవాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. శనివారం పోలవరంలో పెంటపాటి పుల్లారావు గృహం వద్ద నిర్వాసితుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చట్టప్రకారం ప్రభుత్వం ప్యాకేజీ అమలు చేస్తున్నా చెల్లింపుల్లో అధికారుల లోపాలున్నట్టు తెలుసస్తోందని, నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. గిరిజనులు నిజాయితీపరులని, నిజమైన నిర్వాసితులకు కాకుండా అర్హత లేని వారికి ప్యాకేజీలు మంజూరు చేసినట్టు తెలిసిందన్నారు. అలాగే పునరావాసం కూడ సక్రమంగా అమలు కాలేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గఢ్కారీకి అవగాహన ఉందని, గతంలో నిర్వాసితుల విషయమై ఆయనతో మాట్లాడానని ఎమ్మెల్యే చెప్పారు. ప్రస్తుతం నిర్వాసితులు చేసిన ఫిర్యాదులు కూడ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిందని, పూర్తి నిధులు కేంద్రమే చెల్లిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడ ప్రయోజనం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు నిర్వాసితులు సమస్యలు వివరించారు.