పశ్చిమగోదావరి

జిఎస్‌టి వెబ్ చిత్రాన్ని నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 20 : యువతను చెడు మార్గంవైపు మళ్లించే విధంగా రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న జిఎస్‌టి (గాడ్ - సెక్స్-ట్రూత్)వెబ్ చిత్రాన్ని విడుదల కాకుండా నిషేధించాలని ఎపి బిజెపి మహిళా మెర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి అన్నారు. శనివారం కండ్రికగూడెంలోని నెరుసు బాబు కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల కాకుండా చేయాలనే లక్ష్యంతో జిల్లా ఎస్‌పికి, వివిధ పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఈ చిత్రంలో చిత్రీకరించారని, ఈ చిత్రం వలన అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకుంటాయని, తద్వారా సమాజం దెబ్బతింటుందని పేర్కొన్నారు. మహిళా లోకాన్ని ఛాలెంజ్ చేసే విధంగా ఈ చిత్రం వుందని తెలిపారు. ఈ చిత్రాన్ని నిషేధించాలని నేరుగా రామ్‌గోపాల్ వర్మను కోరినప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారని, ఆ యూనిట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మంచి సందేశాలతో చిత్రాలను తీయాలి గానీ అసభ్యకరంగా, కించపరిచే చిత్రాలను తీయడం తగదన్నారు. రామ్‌గోపాల్ వర్మ మానసిక స్థితి సక్రమంగా లేదని డాక్టర్ సమరం కూడా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఆమె వెంట మహిళా నాయకురాళ్లు బొల్లిన నిర్మలాకిషోర్, రామసీత, పాలడుగు త్రిపురసుందరి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, బర్మా శ్రీదేవి తదితరులున్నారు.