పశ్చిమగోదావరి

ఆగస్టుకల్లా ఇళ్లను ప్రారంభిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 16 : ప్రధానమంత్రి - చంద్రన్న గృహ నిర్మాణం పథకంలో జిల్లాలో చేపట్టిన 22వేల 35 ఇళ్ల నిర్మాణం ఆగస్టు నెలాఖరుకల్లా పూర్తి చేసి లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. మండలంలోని ఎల్ అగ్రహారం వద్ద నిర్మిస్తున్నట్టు పట్టణ గృహ నిర్మాణ పథకం ఇళ్ల నిర్మాణాలను మంత్రి మాణిక్యాలరావు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టి సంస్థ కార్యాలయంలో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో జరుగుతున్న నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నిర్మాణాల వివరాలను ఎల్ అండ్ టి ప్రాజెక్టు డైరెక్టర్ యువి కృష్ణమోహన్ తెలియజేశారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ నగర స్థాయిలో సకల సదుపాయాలను ఈ ఇళ్ళ సముదాయంలో కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో తొలి దశలో 16 బ్లాకుల ఇళ్లను ఈ నెలాఖరుకల్లా గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రెండవ దశ ఇళ్ళ నిర్మాణాలకు స్థల కేటాయింపు పూర్తవుతుందన్నారు. భీమవరంలో 9500 ఇళ్లు గునుపూడి వద్ద పురోగతిలో ఉన్నాయని, పాలకొల్లు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద 7159 ఇళ్లు నిర్మాణం జరుగుతుందన్నారు. మొత్తం తొలి దశ ఇళ్ళను సత్వరమే లబ్ధిదారులకు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జ రుగుతున్నాయన్నారు. మూడు కేటగిరిలలో జరుగుతున్న ఈ ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
గూడెంలో పదివేల ఇళ్ళ మెగా టౌన్ షిప్
గూడెంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ళ నిర్మాణం కొనసాగుతుందని మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. నాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రస్తుత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ సహకారంతో 20వేల ఇళ్ళను మంజూరు చేశారని ధన్యవాదాలు తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు అన్ని వౌలిక వసతులతో కూడిన ఇళ్లను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకున్నారని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండో దశ ఇళ్లతో పాటు రాజీవ్ గృహకల్పతో సహా సుమారు పదివేల ఇళ్ళ టౌన్ షిప్‌గా సర్వాంగ సుందరంగా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతుందన్నారు.