పశ్చిమగోదావరి

జిల్లాలోని 338 జడ్పీ హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20: జిల్లాలోని 338 జడ్పీ హైస్కూళ్లలో 1.10కోట్ల రూపాయలతో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటుచేస్తున్నట్లు జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. స్ధానిక జడ్పీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జడ్పీటీసీలు, స్వచ్చంధసంస్ధల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ విజ్ఞానాన్ని క్షణాలలో గ్రామీణ ప్రాంత విద్యార్ధినీవిద్యార్ధులందరికి తెలియాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవ కానుకగా జిల్లాలోని అన్ని జడ్పీ హైస్కూల్స్‌లో డిజిటల్ క్లాస్‌రూంలు ఏర్పాటుజరుగుతుందన్నారు. ఈప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో జడ్పీ 40లక్షల రూపాయలు, కలెక్టరు రూ. 25లక్షలు, విదేశాల్లో ఉన్న మన ప్రాంత ఎన్‌ఆర్‌ఐలు 10లక్షలు, నవభారత్ ఆయిల్‌ఫామ్ కంపెనీ నుండి బోళ్ల రాజు రూ. 10లక్షలు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని, మిగిలిన 25లక్షల రూపాయలు కామవరపుకోట, టి నరసాపురం, పెంటపాడు జడ్పీటీసీలు ఎమ్మెల్యేలు, దాతలతో సహకారం అందించడానికి ముందుకొచ్చారన్నారు. ప్రతి పాఠశాలలోను ఒక ల్యాప్‌టాప్, ప్రాజెక్టరు, స్క్రీన్ ఖచ్చితంగా 55వేల రూపాయలతో ఏర్పాటుచేస్తామని, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏమి జరుగుతుందో రియల్‌టైమ్‌లో సమాచారాన్ని ప్రతిఒక్కరూ పొందగలుగుతారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, చలపతిరావు, టిడిపి నాయకులు భాస్కరరావు, మట్టా సత్యనారాయణ, ధనరాజు తదితరులు పాల్గొన్నారు.

సమృద్ధిగా తాగునీరందించేందుకు ప్రణాళిక
ఏలూరు, ఫిబ్రవరి 20: నగర ప్రజలకు వేసవిలో కూడా రెండుపూటలా సమృద్ధిగా సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ చెప్పారు. స్ధానిక ఆశ్రం కళాశాల వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో నీటి సామర్ధ్యాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. గోదావరి జలాల నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోవటం వల్ల రైతుల అవసరాలు తీర్చడానికి గత మూడురోజుల నుండి గోదావరి జలాలను పంపింగ్ చేయటం లేదని, అయితే వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం గోదావరి అదనపు జలాలు మళ్లించాలని కలెక్టరుకు వినతిపత్రం అందించాలని నిర్ణయించామన్నారు. మూడువేల మిలియన్ లీటర్ల సామర్ధ్యం ఉన్న ఈ సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో ప్రస్తుతం 2160 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉందని, ప్రస్తుతం ఈ నీటి నుండే రోజుకు 45మిలియన్ లీటర్ల రా వాటర్‌ను పంపులచెర్వులోకి మళ్లించి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ప్రతిరోజు 32 మిలియన్ లీటర్ల నీటిని నగరప్రజలకు రెండుపూటలా సరఫరా చేస్తున్నామని, ఇదే పరిస్ధితి కొనసాగితే వేసవిలో 45రోజులూ ప్రజలకు నీరిచ్చే పరిస్దితి ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకుని అదనపు జలాలు మళ్లించాలని కలెక్టరును కోరతామన్నారు. కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నీటిఎద్దడి ఎదుర్కొవడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఏప్రిల్ నుండి జూన్ వరకు కాల్వలు మూసివేసి పరిస్ధితి ఉన్న దృష్ట్యా ఈలోగానే గోదావరి జలాలను సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుకు మళ్లిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలకసంస్ధ కమిషనర్ మోహనరావు, ఇంజనీరు ఎ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్లు చోడే వెంకటరత్నం, గుడివాడ రామచంద్రకిషోర్, కార్పోరేటర్లు పునుకొల్లు పార్ధసారధి, గాడి నాగమణి, జాలా సుమతి, ఈడ్పుగంటి స్వరూపారాణి, లిల్లీకుమారి, కప్పా ఉమామహేశ్వరరావు, రాధాబాబు, ఆర్నేపల్లి హిమగిరి తదితరులు పాల్గొన్నారు.