పశ్చిమగోదావరి

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని నేటి నుంచి ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఫిబ్రవరి 20: పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఈ నెల 21 నుండి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నట్టు టీడీపీ నాయకుడు సావిలి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దారు కార్యాలయం ఎదుట మంగళవారం దీక్షకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా ఎస్సై మధు వెంకటరాజ సిబ్బందితో వచ్చి టెంట్లు ఏర్పాటు చేసేందుకు వీల్లేదని చెప్పారు. దీంతో యువకులు తమకు ప్రభుత్వం ద్వారా జరిగే అన్యాయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు దీక్ష చేపడుతుంటే అడ్డుకోడవమేమిటని పోలీసులతో వాదనకు దిగారు. ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకుంటేనే దీక్షకు అనుమతిస్తామని ఎస్సై స్పష్టం చేయడంతో ఏర్పాట్లు నిలిపివేశారు. అయనప్పటికీ బుధవారం ఎక్కడో ఒక ప్రాంతంలో దీక్ష చేస్తామని ఆందోళనకారులు తెలిపారు.

అదనపు సొమ్ము వసూళ్ల విషయమై ఇసుక ర్యాంపులో వివాదం
తాళ్లపూడి, ఫిబ్రవరి 20: వేగేశ్వరపురంలో ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఇసుక ర్యాంపులో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయమై వివాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను యూనిట్‌కు రూ.800లకే సరఫరా చేయాల్సి ఉండగా వెయ్యి రూపాయల వరకూ వేగేశ్వరపురం ర్యాంపులో డిమాండు చేస్తున్నారని కాంట్రాక్టుదారుడు కె రాంబాబు ఆరోపించారు. మంగళవారం తనకు అత్యవసరమై రోడ్డుపనులకు కావాల్సిన ఒక లారీ ఇసుకను కొనుగోలు చేసుకునేందుకు వేగేశ్వరపురం ర్యాంపునకు వెళ్లానని, యూనిట్‌కు వెయ్యి రూపాయలకు తక్కువ ఇవ్వనని నిర్వాహకులు తెలిపారన్నారు. ఆర్డీవో ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ పనులకు కేవలం రూ.800లు మాత్రమే చెల్లించాలని, అదనంగా ఎందుకు ఇవ్వాలన్నందుకు ర్యాంపులో వ్యక్తులు తనపట్ల దురుసుగా వ్యవహరించారని రాంబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కాకర్ల శ్రీనుకు కాంట్రాక్టర్ రాంబాబుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. ఇదిలా ఉంటే..ఇసుక రీచ్‌ల వద్ద ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణ కరవైంది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా వేగేశ్వరపురం ర్యాంపులో ఏ ఒక్క ప్రభుత్వ సిబ్బంది కానరాలేదు.