పశ్చిమగోదావరి

రైతుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఫిబ్రవరి 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సాయంత్రం పోలవరంలోని కృష్ణారావుపేట సొసైటీలో మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. కొత్తూరు చెరువుకు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు వచ్చేలా రూ.35లక్షలతో స్లూరుూజ్ నిర్మిస్తున్నారని, దాని కారణంగా చెరువు ఆయకట్టుకు 4,500 ఎకరాలకు నీటి ఎద్దడి ఉండదన్నారు. అలాగే ఈ వేసవిలో పుంత రోడ్లు బాగు చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గూటాల పంపింగ్ స్కీం మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక మాట్లాడుతూ ఈ సీజన్లో పండిన పంటలే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని రైతులను ఆమె కోరారు. ఎమ్మెల్యే కృషి కారణంగానే ఈ కొనుగోలు కేంద్రం మంజూరైందని ఆమె చెప్పారు. ఈ కేంద్రంలో కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన సొమ్మును వారం రోజుల్లో రైతు ఖాతాకు జమ చేస్తామన్నారు. మినుములు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.5,400లు, కందులకు రూ.5,450లు, పెసలు రూ.5,575లు, మొక్కజొన్న రూ.1420లకు కొనుగోలు చేస్తామని ఆమె తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్క్‌ఫెడ్ మేనేజర్ నాగమల్లిక చెప్పారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కొణతాల ప్రసాద్, ఎంపీపీ పైల అరుణకుమారి, బొరగం శ్రీనివాసరావు, కుంచే దొరబాబు, జల్లేపల్లి నర్సింహారావు, బాదం ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పొగాకు అనాథరైజ్డ్ బ్యారన్ల రెగ్యులరైజేషన్‌కు అనుమతి
దేవరపల్లి, ఫిబ్రవరి 20: పొగాకు అనాథరైజ్డ్ బ్యారన్లను రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు పొగాకు బోర్డు అనుమతిచ్చిందని దేవరపల్లి పొగాకు వేలం నిర్వహణాధికారి హనుమంతురావు తెలిపారు. మంగళవారం ఆయన బోర్డు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఈ అవకాశం ఉందని, పొగాకు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెగ్యులరైజేషన్ చేసుకునే రైతులు వేలం కేంద్రంలో దరఖాస్తు పూర్తిచేసి, రైతుకు చెందిన రెండు ఫొటోలు, మరో ఇద్దరు రైతుల సాక్ష్యాలతో నోటరీ చేయించుకోవాలన్నారు. లైసెన్స్ అందిన రైతు ముందుగా తనకున్న బ్యారన్లను నేలమట్టం చేయాలని, ఆ బ్యారన్లపై ఏ విధమైన అప్పులూ లేవని నో డ్యూస్ సర్ట్ఫికెట్ తీసుకురావాలని తెలిపారు. అనాథరైజ్డ్ బ్యారన్లను రెగ్యులరైజ్ చేసుకున్న బ్యారన్లకు ఎంఎల్‌ఎస్ ఏరియాలోగల ఎక్కడైనా క్రయవిక్రయాలు చేసుకోవచ్చునన్నారు.