పశ్చిమగోదావరి

సాహిత్యానికి దేవుడిచ్చిన వరం సిరివెనె్నల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 18 : తెలుగు సాహిత్యానికి దేవుడిచ్చిన వరం సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అని రాష్ట్ర ఎఫ్‌డిసి ఛైర్మన్ అంబికా కృష్ణ పేర్కొన్నారు. సినిమా సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత సీతారామశాస్ర్తీకే దక్కుతుందన్నారు. సినీ గీతం పేరు చెబితే ప్రతీ ప్రేక్షకుడు సిరివెనె్నల గీతాలను తలుచుకుని పులకరించిపోతారన్నారు. ఏలూరు నగర బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్థానిక కెపిడిటి హైస్కూలు గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఉగాది వేడుకల్లో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన అంబికా కృష్ణ మాట్లాడుతూ కొంతమంది కారణజన్ములుగా పుడతారని, ఆ కోవకు చెందిన వారు సిరివెనె్నలని పేర్కొన్నారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామశాస్ర్తీ తన గీతాలతో తెలుగు సాహిత్యానికి కొత్తరూపాన్ని సంతరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సిరివెనె్నల సీతారామశాస్ర్తీ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం సీతారామశాస్ర్తీ మాట్లాడుతూ ఏలూరుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ముఖ్యంగా అంబికా సంస్థతో తనకు ఎంతో ఆత్మీయత, అనుబంధం వుందని చెప్పారు. అంబికా సంస్థల ఛైర్మన్ అంబికా కృష్ణ వ్యక్తిత్వం పట్ల తనకున్న అనుబంధం కారణంగానే ఈరోజున ఈ ఉగాది వేడుకల్లో పాల్గొనడానికి వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా హేలాపురి నగర బ్రాహ్మణులు తన పట్ల చూపిన ఆత్మీయ అనురాగానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై వుంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్, గౌరవాధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, కార్యదర్శి తోలేటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ద్రోణంరాజు వెంకటరమణ, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ ఎంబి ఎస్ శర్మ, వివిధ బ్రాహ్మణ సంఘాల నేతల సి ఎపి ఎస్ రామానుజాచార్యులు, గోపరాజు వెంకట్రామయ్య, దుర్బ విజయసాగర్, మంత్రిప్రగడ శ్రీహరిరావు, ఎస్‌టి పార్ధసారధి, మైలవరపు నాగేంద్రకుమార్, వెంపటి రవికుమార్, ఘంటసాల ప్రసాద్, వేదాంతం విష్ణుప్రసాద్, కొంపెల్ల తాయారు, కొడాలి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి బుల్లితెర ఫ్రేం చిత్రలేఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆర్టిస్ట్ కె ఎల్‌వి నరసింహం సినీ గేయ రచయిత సిరివెనె్నల గీతాలను పాడి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్, మాచిరాజు కిరణ్‌కుమార్‌లు పంచాంగ శ్రవణం నిర్వహించారు.

అలరించిన ఉగాది స్వాగత నృత్యాలు
ఏలూరు, మార్చి 18: శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక, భాషా సమితి, వైఎంహెచ్‌ఎ సంయుక్త ఆధ్వర్యంలో స్ధానిక వైఎంహెచ్‌ఎ హాలులో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. తొలుత పార్వతీ రామచంద్రన్ శిష్యబృందం ప్రదర్శించిన ‘వసంత ఉగాది’ నృత్యం అహుతులను అలరించింది. అనంతరం అన్నమయ్య గీతాలకు చిన్నారులు చేసిన నృత్యం ప్రేక్షకులను అలరించింది. తర్వాత గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన ‘మా తల్లి గోదావరి’ నృత్య రూపకానికి ప్రేక్షకులు హర్షధ్వనాలు చేశారు. చివరిగా పార్వతీరామచంద్రన్, గండికోట రాజేష్‌లను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.

లక్ష గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు
ద్వారకాతిరుమల, మార్చి 18: గ్రామదేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారు లక్ష గాజుల అలంకరణలో ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. క్షేత్ర ఉపాలయమైన ఈ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కన్నుల పండువగా జరిగాయి. ఈ నెల 26 వరకు జరుగనున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిత్యం ఉదయం, సాయంత్రం కుంకుమార్చనతో పాటు గాజుల అలంకరణలో నిండు ముత్తయిదువుగా భక్తులకు దర్శనమీయనున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే నిండు సౌభాగ్యవతులవుతారని పండితులు చెబుతున్నారు.