పశ్చిమగోదావరి

గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.63 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 24 : జిల్లాలోని గ్రామ పంచాయితీల అభివృద్ధికి 14వ ఫైనాన్స్ కమిషన్ 2వ విడతగా 63 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో గ్రామ పంచాయితీల్లో పన్నుల వసూళ్లు, డంపింగ్ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణానికి ఈ నిధుల్లో 50 శాతం ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పారు. జిల్లాలో 909 పంచాయితీల్లో చేపట్టిన డంపింగ్ యార్డుల నిర్మాణానికి సంబంధించి 169 గ్రామాల్లో షెడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని, వచ్చే సమావేశానికి అన్ని షెడ్లు నిర్మాణం చివరి దశకు రావాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పంచాయితీల్లో నూరుశాతం పన్నుల వసూళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

సింగన్నదొర సతీమణికి శాసనసభాపతి లేఖ
పోలవరం, మార్చి 24: పోలవరం మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర మృతిపట్ల రాష్ట్ర శాసనసభ సంతాప తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలియజేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పంపించిన లేఖను సింగన్నదొర సతీమణి శ్రీలక్ష్మికి శనివారం అందజేశామని తహసీల్దార్ సిహెచ్ రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యునిగా సింగన్నదొర ప్రజలకు అందించిన సేవలను స్మరిస్తూ ఈ నెల 12వ తేదీన శాసనసభ ఘనంగా నివాళులర్పించినట్టు లేఖలో పేర్కొన్నారు. శాసనసభ తీవ్ర సంతాపం వ్యక్తంచేసి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపినట్టు లేఖలో వివరించారు. శాసనసభాపతి పంపించిన లేఖను శ్రీలక్ష్మికి పూర్తిగా చదివి వినిపించిన అనంతరం అందజేశామని తహసీల్దార్ రవికుమార్ తెలిపారు.