పశ్చిమగోదావరి

లాభాల కిక్కులేదని కినుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 24 : మద్యం కొనుగోలు విషయంలో కమీషన్ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో జిల్లాలోని మద్యం వ్యాపారులు బుధవారం నుంచి మద్యం డిపోల్లో కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇంతకాలం కమీషన్ పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి డిమాండ్ చేసినా ఫలితం లేకపోవడంతో ఒక్కో మద్యం దుకాణానికి పది లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతోందని అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఆందోళనకు సిద్ధమైనట్లు వారు చెబుతున్నారు. జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లకు చెందిన నిర్వాహకులు ఈ ఆందోళనను చేపట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగించాలని నిర్ణయించారు. లైసెన్సు ఫీజుల తగ్గింపు పేరుతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీలో వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా కమీషన్‌ను నిర్ణయించారని అసోసియేషన్ ధ్వజమెత్తింది. కమీషన్‌ను గణనీయంగా తగ్గించడం వలన మద్యం లైసెన్సు దారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్ల అసోసియేషన్ పేర్కొంది. 45 సంవత్సరాల ఎక్సైజ్ చరిత్రలో మొట్టమొదటి సారిగా గత నెలలో నాలుగు జిల్లాల్లో మద్యం డిపోల నుంచి కొనుగోళ్లను నిలిపివేస్తే పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారని రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు రాయల సుబ్బారావు పేర్కొనడం జరిగింది. 50 రోజులు గడచిపోయిన ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. మరో రెండు నెలల్లో సంవత్సర లైసెన్సు ఫీజులు చెల్లించాల్సి వుందని, ఇప్పటికే పెట్టుబడులు మూడొంతులు హరించుకుపోయాయని, ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులు, బార్‌లు మద్యం డిపోల నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామే తప్ప తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు.
కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చే ట్రేడ్ మార్జిన్‌ను 7.5 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేసిన మద్యం వ్యాపారానికి, ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం వుందని ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మద్యం ఆదాయాలకు తీవ్రంగా గండిపడిందని వారు పేర్కొంటున్నారు. గతంలో 22 శాతం వరకు కమిషన్ వచ్చేదని, లాటరీ విధానం ద్వారా మద్యం దుకాణాలు కేటాయించిన తరువాత ఈ కమిషన్ 18 శాతానికి ఇస్తున్నారన్నారు. తాజాగా ఈ లీజ్ పిరియడ్‌లో ఫీజులు తగ్గించామనే ఉద్దేశ్యంతో ట్రేడ్ మార్జిన్‌ను 7.5 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. మద్యం కొనుగోలులో వ్యాపారులకు ఎం ఆర్‌పి ట్రేడ్ మార్జిన్‌ను పెంచుకుంటూ పోతోందని, దీని వలన ఇచ్చే కమీషన్‌ను తగ్గించడం వలన తాము పూర్తిగా నష్టపోతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. లాటరీ జరిగిన మూడు నెలలకు గానీ మద్యం వ్యాపారాలు ప్రారంభించలేదని, జిల్లా వ్యాప్తంగా 474 మద్యం దుకాణాలుండగా వాటికి సంబంధించి 128.26 కోట్లు, జిల్లాలోని 38 బార్లకు సంబంధించి 720 కోట్లు లైసెన్సు ఫీజులుగా వ్యాపారస్తులు చెల్లించాలని తెలిపారు. అయితే ఈసారి మద్యం వ్యాపారం ప్రారంభించే సమయంలో రాష్ట్ర రహదారుల ప్రక్కన మద్యం దుకాణాలు ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ నిబంధనలు అమలుచేయడం వలన రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వలన ఒక్కో వ్యాపారస్తునికి అదనంగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెరిగిందని రాష్ట్ర, జిల్లా వైన్ డీలర్ల అసోసియేషన్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఈ విధంగా మద్యం దుకాణదారులు అన్ని విధాలా నష్టపోయారని, కనీసం కమీషన్ పెంపుద్వారా వారిని ఆదుకోవాలని కోరారు. ఈ డిమాండ్ నెరవేరే వరకు బుధవారం నుంచి చేపట్టే ఆందోళన కొనసాగుతుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు.

ఎటూ తేలని కౌన్సిలర్ల రాజీనామా వ్యవహారం
*అదిష్ఠానం సీరియస్
నరసాపురం, ఏప్రిల్ 25: మున్సిపల్ డీఈ శ్రీకాంత్‌ను విధుల్లో కొనసాగించడాన్ని విభేదించి తమ పదవులకు రాజీనామా చేసిన నరసాపురం కౌన్సిలర్ల వ్యవహారం ఎటూ తేలలేదు. ఈ విషయంపై అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలిసింది. ఎటువంటి సమాచారం అందించకుండా మున్సిపల్ ఛైర్‌పర్సన్ రత్నమాల సాయితో పాటు కౌన్సిలర్లు రాజీనామా చేయడంలో దాగి ఉన్న ఆంతర్యాన్ని నిగ్గుతేల్చే పనిలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామాల వ్యవహారంలో ఎవరి హస్తం ఉన్నదనే దానిపై ఆరా తీస్తోంది. రాజీనామా చేసిన కౌన్సిలర్లలో ఐదుగురు మాత్రమే టీడీపీ గుర్తుపై గెలిచినవారు కాగా మిగిలిన వారు వైసీపీ గుర్తుపై గెలిచినవారుగా అధిష్ఠానం గుర్తించినట్టు తెలిసింది. టీడీపీ గుర్తుపై గెలిచిన మిగిలిన కౌన్సిలర్లు ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నట్టు స్థానిక పార్టీ నాయకులు అధిష్ఠానానికి నివేదికలిచ్చారు. దీంతో ఈ సమస్యను కొలిక్కి తీసుకొచ్చే బాధ్యతను రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి అప్పగించారు. అలాగే నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పొత్తూరి రామరాజులు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రత్నమాల సాయి, రాజీనామా చేసిన కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. కౌన్సిలర్ల రాజీనామా బుధవారం నాటికి ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.