పశ్చిమగోదావరి

బహుముఖ సేవల రుద్రభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 26: సామాన్యప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బహుముఖ సేవలందించే విధంగా హిందూ రుద్రభూమిని తీర్చిదిద్దడం ఆదర్శనీయమని నర్సపురం ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. మానవత సంస్థ, పీఎమ్మార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన మామిడాల చెరువు హిందూ రుద్ర మోక్ష భూమి ప్రాంగణాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. మానవత జిల్లా అధ్యక్షుడు సాగిరాజు జానకీరామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గంగరాజు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కడాలేనివిధంగా దూరదృష్టితో హిందూ రుద్రభూమిని నిర్మించడం అభినందనీయమన్నారు. మానవ సంస్థను స్థాపించిన ఎం రామచంద్రరెడ్డి సామాజిక సేవ, కృషిని కొనియాడారు. అన్ని సదుపాయాలతో ఎమ్మెల్యే మాణిక్యాలరావు ఆధ్వర్యంలో రుద్రభూమి మంచి వాతావరణంలో రూపుదిద్దుకుందన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ తనకు ఎదురైన అనుభవాలతోనే హిందూ రుద్ర భూమిని అన్ని వసతులతో సామాన్యులకు ప్రయోజనకరంగా నిర్మించామన్నారు. అద్దె ఇళ్లల్లో ఉన్నవారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మృతిచెందితే వారి పరిస్థితి దుర్భరంగా ఉంటుందన్నారు. ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి భౌతిక కాయాన్ని తీసుకురాకుండా అడ్డుకుంటున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దూర ప్రాంతాల నుంచి బంధువులు రావలసి ఉంటే వారు వచ్చేవరకూ రుద్రభూమి ప్రాంగణంలో ఉన్న శీతల శవపేటికలలో భద్రపర్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించుకునే విధంగా ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. శవ పేటికలు రవాణాకు వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. ఇంటి సదుపాయం లేనివారు ఈ ప్రాంగణంలోనే ఉత్తర క్రియలు నిర్వహించుకునేందుకు హాలు ఏర్పాటు చేశామని, కుటుంబం ఇక్కడే స్నానాలు ముగించుకునేందుకు మహిళలు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులను వేడి నీటి సదుపాయంతో నిర్మించామన్నారు. మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరై ఉంటే బాగుండేదన్నారు. రుద్రభూమి ప్రాంగణంలో రూ.40లక్షలు వ్యయంతో శివాలయాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ బాలస్వామి మాట్లాడుతూ మానవ జీవితంలో చివరి అంకం శ్మశానమన్నారు. దుర్భరంగా ఉన్న ఈ ప్రాంగణంలో అన్ని వసతులతో ప్రజలకు అందుబాటులో రుద్రభూమిని నిర్మించిన మానవత - పీఎమ్మార్ చారిటబుల్ ట్రస్టు బాధ్యుల కృషిని కొనియాడారు. మానవత సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ సామాజిక పరిస్థితుల కనుగుణంగా మానవత స్వచ్ఛంద సంస్థను స్థాపించామన్నారు. దీనిని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే మాణిక్యాలరావు ఎంతో శ్రమించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోట రాంబాబు, పైబోయిన వైదేహి, తహసీల్దార్ నాగమణి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఈతకోట తాతాజీ, వాసవి ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు కర్రి సీతారామయ్య, నూకల బుల్లియ్య, ఏఎంసీ మాజీ ఛైర్మన్ పోతుల అన్నవరం, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు.