పశ్చిమగోదావరి

సామాజిక వర్గాలను టార్గెట్ చేసిన వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 22: జిల్లాలోని ఆయా సామాజిక వర్గాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఆ సామాజిక వర్గం నుంచి కొత్త ముఖాలు, మాజీలను పార్టీలోకి తీసుకురావాలని చాలా ధృఢసంకల్పంతో ఉంది. జిల్లా రాజకీయం అంతా డెల్డా పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డెల్టా ప్రాంతంలోని రాజకీయ కేంద్ర బిందువుగా ఉన్న భీమవరం నుంచి వైసీపీ రాజకీయాన్ని గత కొద్ది రోజులుగా నడుపుతోంది. ఇందులో భాగంగానే క్షత్రియ సామాజిక వర్గం నుంచి టిక్కెట్లు కావాలని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గం వైసీపీ వైపు బెర్తుకోసం పరుగులు తీయడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా క్షత్రియుల విషయంలో వైసీపీ సక్సస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్నవారికి కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. కేవలం పాందువ్వ శ్రీను, గాదిరాజు బాబు, కంతేటి సత్యనారాయణరాజు, పొత్తూరి రామరాజులు ఆయా పదవుల్లో ఉన్నారు. కానీ కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. దీంతో క్షత్రియ సామాజికవర్గం జగన్ వైపు చూస్తోంది. ఆ పార్టీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేరితే ప్రాధాన్యత ఉంటుందన్నది వారి వాదన. దీంతో క్షత్రియ సామాజికవర్గం నుంచి పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఎఎస్ రాజు చేరిన సంగతి తెలిసిందే. ఇక భీమవరంలో ఆచంట నియోజకవర్గ అభ్యర్థిగా చెరుకువాడ శ్రీరంగనాధరాజు చేరతారని భావిస్తున్నారు. వీరంతా బీజేపీ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీలో చేరడం జరుగుతోంది. ఈ విధంగా వైసీపీలోకి క్షత్రియ సామాజికవర్గంను తీసుకురావడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మరో పక్క వేగిరాజు రామకృష్ణంరాజు (ఆశ్రమం డాక్టర్), వేగేశ్న కనకరాజు సూరి క్షత్రియ సామాజికవర్గం నుంచి పార్టీలో ఎలాగో ఉన్నారు. ఇక కాపు, తూర్పుకాపు సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిది వైసీపీ. ఉండి నియోజకవర్గంలో జరిగే ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా బొత్సా సత్యనారాయణ బంధువులు, తూర్పుకాపులు పార్టీలో చేరతారని సమాచారం. ఒక వేళ అక్కడ సమయం లేకపోతే భీమవరంలో చేరతారు. ఇక కాపు సామాజిక వర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. భీమవరం, నరసాపురం, తణుకు, పాలకొల్లు వంటి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గంలోని కాపులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ఆయా సామాజికవర్గాలకు చెందిన పెద్దోళ్ళు పనిచేస్తున్నారు. ముఖ్యంగా పాలకొల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీపై దృష్టి సారించింది. ఒకవేళ బాబ్జీ పార్టీలోకి రావడానికి నిరాకరించిన నేపథ్యంలో మరొకరికోసం అనే్వషిస్తున్నారు. ఇక బీసీ సామాజికవర్గంలో గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గం ఈ పార్లమెంటులో అంటే డెల్టా ప్రాంతంలో ఎక్కువ. ఆ సామాజికవర్గం నుంచి మంత్రి పితాని సత్యనారాయణరాజుకు చెందిన బంధువు ఇప్పటికే వైసీపీలో ఉన్నారు. వారి ద్వారా గౌడ, శెట్టిబలిజలను పార్టీలోకి తీసుకురావాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలా ఉండగా రేపటి నుంచి డెల్టాలో ప్రారంభం కానున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర నేపథ్యంలో నియోజకవర్గాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు చెప్పారు.