పశ్చిమగోదావరి

నిరవధిక సమ్మెను ప్రారంభించిన తపాలా ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 22 : తపాలా శాఖలో పనిచేస్తున్న జిడి ఎస్ ఉద్యోగులకు పి ఆర్‌సి వర్తింపచేయాలని కోరుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో తపాలా శాఖలోని ఉద్యోగులంతా విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెను మంగళవారం ప్రారంభించారు. దీనితో నగరంలోని తపాలా శాఖ కార్యాలయాలన్నీ మూతపడటంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. తపాలా ఉద్యోగులు ప్రధాన కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులకు వేతన సవరణ నిమిత్తం నియమించబడిన కమలేష్ చంద్ర కమిటీ నివేదికను అమలుచేయాల్సిందిగా కోరుతూ అన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం జరిగిన వేతన సవరణ అనంతరం తపాలా శాఖలోని అట్టడుగున వున్న ఉద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ డిపార్టుమెంట్ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సులను 2016 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసి జిడి ఎస్ పట్ల పూర్తి వివక్షత ప్రదర్శిస్తోందన్నారు. వారికి పెన్షన్, మెడికల్ గ్రాట్యుటీ సౌకర్యాలు లేకుండా తపాలా శాఖలో మగ్గుతున్నారని, కనీస జీతభత్యాలు కూడా లేకుండా అత్యధిక పనిభారంతో మగ్గుతున్నారని, జిడి ఎస్‌లకు పే కమిటీని వెంటనే అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మె చేస్తున్నట్లు తపాలా ఉద్యోగుల సంఘ జిల్లా నాయకులు వివివి సత్యనారాయణ, వి బాపిరాజు, డి స్వామి, బి సత్యనారాయణ, కె మరియన్న, వి సత్యనారాయణ, ఎస్ అడ్వర్డ్‌లు తెలిపారు. నగరంలో వివిధ తపాలా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులునిరసన ప్రదర్శన జరిపి అనంతరం ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా, ఆందోళన నిర్వహించారు. తపాలా ఉద్యోగుల సమ్మెను తక్షణమే విరమింపచేయాలని పలు ప్రజా సంఘాల నాయకులు కోరారు.
భీమవరం: కేంద్ర ప్రభుత్వం వెంటనే పోస్టల్ జిడిఎస్ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పోస్టల్ ఉద్యోగ సంఘాల జేఏసీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపునందుకుని భీమవరం హెడ్ పోస్ట్ఫాసు వద్ద మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో భీమవరం డివిజన్‌లోని అన్ని తపాలా కార్యాలయాలు మూతపడ్డాయి. ఆలిండియా పోస్టల్ ఎంప్లారుూస్ యూనియన్ గ్రూప్ సి ఉద్యోగ సంఘం ఏపీ సర్కిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్.లెనిన్‌బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7వ వేతన సవరణ సంఘంలో పోస్టల్ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై కేంద్రం తిరిగి కమలేష్ చంద్ర కమిటీని నియమించిందన్నారు. ఆ కమిటీ పోస్టల్ జెడిఎస్ కమిటీకి ఆనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. అయితే వాటిని గత పదిహేనేళ్లుగా తొక్కిపెట్టి జెడిఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేదని, దీంతో ఉద్యమ బాట పట్టామని స్పష్టం చేశారు. అధ్యక్షుడు జివి ప్రసాదరాజు, పోస్టుమెన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకన్నదొర, ఎన్.ప్రకాశరావు, వి.నాగేశ్వరరావు, సి.సుప్రభు తదితరులు పాల్గొన్నారు.