పశ్చిమగోదావరి

వైసీపీని గెలిపిస్తే అందరికీ ‘సంక్షేమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమర్రు, మే 22: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్ర 168వ రోజుకు మంగళవారం చేరుకుంది. గణపవరం మండలం చిలకంపాడు వద్ద నియోజకవర్గంలోకి చేరింది. ఈ సందర్భంగా చిలకంపాడు, కాశిపాడు గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను జగన్‌కు వివరించారు. మత్స్యకారులకు వలలు అందించాలని కోరారు. ఈ విషయాలపై వైసీపీ నేత జగన్ స్పందిస్తూ తాను అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా రోడ్ల వెంబడి మాసూళ్ళు చేస్తున్న రైతులతో కలిసి తాను ఒక రైతుగా ధాన్యం ఎగరబోసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిప్పర సెంటర్‌లో శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. ఈ పాదయాత్రలో వైసీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ళ నాని, ఏలూరు పార్లమెంటరీ ఇన్‌ఛార్జి కోటగిరి శ్రీ్ధర్‌బాబు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, సుబ్బరాజు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి సోమరాజు, గణపవరం మండల కన్వీనర్ దండు రాము, నిడమర్రు కన్వీనర్ సంకు సత్యకుమార్, ఉంగుటూరు కన్వీనర్ మరడా మంగారావు, భీమడోలు కన్వీనర్ సత్యశ్రీనివాస్, బత్తి సాయిబాబా, బుద్ధవరపు పుల్లయ్య, తెనాలి సునీల్, దండు సూరిబాబు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.