పశ్చిమగోదావరి

రాష్ట్రంలో గోపాలమిత్రల కృషి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, మే 24 : రాష్ట్రంలో గోపాలమిత్ర సభ్యులు పశుసంపదకు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెంటపాడు తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ భవనాన్ని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాజమండ్రి ఎం.పీ మాగంటి మురళీమోహన్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గోపాల మిత్ర సభ్యుల జీతం ఎనిమిది వేల నుంచి పది వేలు వచ్చేందుకు సీఎం చంద్రబాబుతో కలిసి గతంలో సమీక్షించామన్నారు. త్వరలో సంబంధిత అధికారులతో సమీక్షించి ఈ విషయంపై చర్యలు చేపట్టేందుకు సీ ఎంతో సంప్రదిస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో పశుసంపదను పెంపొందించి రైతులు మంచి దిగుబడి పొందేందుకు చర్యలు చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గేదెలు మన రాష్ట్రంలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని, పశువుల దాణా రూ.5లు సబ్సిడీతో అందజేస్తామన్నారు. రూ.1.40కోట్లతో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో పాడి పంటలు అభివృద్ధికి యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి పుల్లారావు ఆదేశించారు. రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ గ్రామాల్లో పశుసంపదను పెంపొందించి వాటిపై ఆధారపడి రైతుల ఆదాయం పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకుని వారికి అండగా ప్రభుత్వం ఉందన్నారు. రాజమండ్రి ఎం.పీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామాల్లో పాడి పంటలు చాలా ప్రధానమైనవని, వాటి సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ ఒక్క గోవు ద్వారా పదెకరాలు వ్యవసాయం చేయవచ్చని, పశువుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో పశువుల డాక్టర్ల కొరత ఉందని, త్వరలో డాక్టర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఆదిరెడ్డి అప్పారావుమాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్త కళల సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, జడ్పీటిసి కిలపర్తి వెంకట్రావు, డిసిసిబి డైరెక్టర్ దాసరి అప్పన్న, ఎంపీడీవో జివికె.మల్లిఖార్జునరావు, మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకటకృష్ణారావు, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీనివాసరావు, భీమవరం డిప్యూటి డైరెక్టర్ సత్యగోవింద్, డిఎం నాయక్, కృష్ణా జిల్లా డిసిడిఎ చైర్మన్ అనిల్‌కుమార్, ప్రజాప్రతినిధులు, టీడీపీ, బీజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.