పశ్చిమగోదావరి

జగన్ వెనక మోదీ, షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, మే 24: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని వెనకుండి నడిపించేది నరేంద్ర మోదీ, అమిత్‌షాలు.. పవన్‌కు గానీ బీజేపీకి గానీ ఒక్క సీటైనా వస్తుందా! అంటూ ఉండిలో గురువారం జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో నాయకులు ఒక్కొక్కరుగా జగన్, జనసేన అధినేత పవన్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు గురువారం ఉదయం ఉండిలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో జరుగుతున్నది దొంగల బండి యాత్ర అన్నారు. దొంగల ఆధ్వర్యంలో జరుగుతున్న దొంగల బండి యాత్రగా నేతలు అభివర్ణించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవటానికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ము చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనితో పాటు రైతుకు సాగునీరు అందించటమే కాకుండా నదులు అనుసంధానం చేసిన ఘనత కూడా తమ ప్రభుత్వందేనని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారని పేర్కొన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలు కందిపప్పుతో పాటు త్వరలో మినప్పప్పు, పామాయిల్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. కందిపప్పు ధర కూడా తగ్గిస్తున్నామని పేర్కొన్నారు.
తిరుపతి వెంకన్నతో పెట్టుకోవద్దు!
తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ దానిని విస్మరించారు. ఇటీవల పదేపదే తిరుపతి వెంకటేశ్వరస్వామి నగలు దొంగలించబడ్డాయి అని గగ్గోలు పెడ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను నడిపించేది బీజేపీ అని, తిరుపతి వెంకటేశ్వరస్వామి ఇద్దరికీ తగిన శాస్తి చేస్తాడని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ ప్రజల పార్టీగా బాగా బలపడిందన్నారు. అందువల్లే ఎన్నికల్లో 15 సీట్లు గతంలో గెలవటమే కాకుండా రానున్న ఎన్నికల్లో కూడా తిరిగి 15 సీట్లు, మూడు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మినీ మహానాడుకు తరలివచ్చారు.