పశ్చిమగోదావరి

జగన్‌కు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, మే 27: వైఎస్ జగన్ పాదయాత్ర ఆదివారం సమస్యలు వింటూ ముందుకు సాగింది. శనివారం జక్కరం వద్ద ఆగిన యాత్ర ఆదివారం అక్కడి నుంచి కోపల్లె మీదుగా పెద అమిరం వరకు సాగింది. కాళ్ల మండలంలో వైఎస్ జగన్‌కు మహిళలు, యువకులు, వృద్ధులు ఘన స్వాగతం పలికారు. పెద అమిరంలో జిల్లా రైసు మిల్లర్స్ సంఘ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా ఆహ్వానించారు. రంగనాధరాజు లాంటి వారి రాక స్వాగతిస్తున్నామని జగన్ అన్నారు. ఈ సందర్భంగా రంగనాధరాజు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే తనకెంతో అభిమానం అన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలంటే జగన్ సీఎం కావాలని, అప్పుడే తగిన న్యాయం ప్రజలకు జరుగుతుందన్నారు. అదే విధంగా భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎఎస్ రాజు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జగన్ వైసీపీ కండువాను ఎఎస్ మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. విశ్రాంత ఐపీఎస్ లక్ష్మీరెడ్డి ఆయన అనుచర వర్గంతో జగన్మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాస్‌చంద్రబోస్, కొయ్యే మోషేన్‌రాజు, గూడూరి ఉమాబాల, మేకా శేషుబాబులు ఉన్నారు. జగన్ పాదయాత్రలో పలుచోట్ల మహిళలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పీఈటీ టీచర్స్ తమ సమస్యలు జగన్‌కు తెలియజేశారు. అలాగే కొబ్బరి వలుపు కార్మికులు, గీత కార్మికులు తమ సమస్యలు మొరపట్టుకున్నారు. పీవీఎల్ నరసింహరాజు, పాతపాటి సర్రాజు తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
మద్ది ఆంజనేయుని సన్నిధిలో
నఖ చిత్రకారుడు డాక్టర్ రవి పరస
జంగారెడ్డిగూడెం, మే 27: అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన నఖ చిత్రకారుడు డాక్టర్ రవి పరస ఆదివారం శ్రీ మద్ది ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన డాక్టర్ రవికి స్వామివారి దర్శనం, అష్టోత్తర పూజ అనంతరం చిరు సత్కారం చేసి ప్రసాదాలు అందజేశారు. డాక్టర్ రవి దేవస్థానం ఛైర్మన్ ఇందుకూరి రంగరాజు సమక్షంలో ఓంకారంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వరస్వామివారి చిత్రం నఖములతో (గోళ్లతో) కార్డుపై చిత్రించి ఛైర్మన్ రంగరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు పంతెన సత్యనారాయణపాపరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. డాక్టర్ రవి చిత్రాలు, నఖ చిత్రకళ రాబోవు తరాలకు ఆదర్శమని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) పేర్కొన్నారు.