పశ్చిమగోదావరి

ఘనంగా ఫాదర్స్‌డే వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 17 : ఆదివారం ఫాదర్స్‌డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ తన తండ్రి చింతమనేని కేశవరావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా చింతమనేని ప్రభాకర్‌కు తన కుమారుడు నయన శ్రీ సత్య కూడా గ్రీటింగ్, పుష్పగుచ్ఛాలు అందజేసి ఫాదర్స్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు.
గోపాలపురం చేరిన గోదావరి జలాలు
గోపాలపురం, జూన్ 17: పట్టిసం ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వ నుండి విడుదల చేసిన గోదావరి జలాలు ఆదివారం గోపాలపురం చేరాయి. గోదావరిలో నీటిమట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు శనివారం నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం పట్టిసంలో 14 మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో కాలువలోకి నీరు ఉద్ధృతంగా చేరింది. ఆదివారం సాయంత్రానికి దేవరపల్లి మండలంలో ప్రవహిస్తుంది. కాగా ఇరిగేషన్ ఎస్‌ఈ డి వీరకుమార్, డీఈ శ్రీనివాస్ తదితరులు గుడ్డిగూడెం గ్రామం వద్ద కాలువ గట్లను, నీటి ప్రవాహ వేగాన్ని పరిశీలించారు.

కొనసాగుతున్న క్షురకుల ఆందోళన
ద్వారకాతిరుమల, జూన్ 17: చిన వెంకన్న క్షేత్రంలో క్షురకులు చేస్తున్న కత్తి డౌన్ ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం నారుూ బ్రాహ్మణులు కొందరు విధులు బహిష్కరించి, కేశ ఖండన శాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం మొక్కుబడులు తీర్చుకునేందుకు క్షేత్రానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కనీస వేతనంగా నెలకు రూ.15వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్మైంట్ బెనిఫిట్ సౌకర్యాలు కల్పించాలని నారుూ బ్రాహ్మణులు డిమాండు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారం నిమిత్తం క్షురకులు ఆందోళనలు చేస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని క్షౌర వృత్తిదారుల సంఘ నేతలు హెచ్చరించారు. ఆదివారం ఆలయానికి తలనీలాలు సమర్పించే భక్తులు గంటల తరబడి మొక్కుబడులు తీర్చుకునేందుకు వేచి ఉండాల్సి వచ్చింది.