పశ్చిమగోదావరి

యోగాతో ఆరోగ్యకరమైన జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 21: సమాజంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపేందుకు యోగా ఉత్తమ మార్గమని ఏలూరు ఎంపి మాగంటి బాబు అన్నారు. స్ధానిక ఇండోర్ స్టేడియంలో ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన యోగ దినోత్సవంలో ఎంపి మాగంటి బాబు, కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ మనస్సును, శారీరక ఆరోగ్యాన్ని ఉన్నత ఆలోచనలు కలిగించి సమతుల జీవితాన్ని యోగ అందిస్తుందన్నారు. ప్రస్తుత జీవనవిధానంలో ఉండే బాధ్యతలు, మానసిక, శారీరక వత్తిళ్లు అధిగమించడానికి యోగ తోడ్పడుతుందన్నారు. గత మూడేళ్ల నుండి రాష్టవ్య్రాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ జబ్బు వచ్చి బాధపడేకన్నా అది రాకుండా ఉండేందుకు యోగ వంటి సాధన ప్రతిఒక్కరూ చేయాలన్నారు. యోగ కేవలం మనిషి ఆరోగ్యానికి పరిమితమైనదే కాదని ఆరోగ్యవంతమైన ఆలోచనలు అంకురించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారితో యోగ నిపుణులు ధర్మారావు పలు యోగాసనాలు వేయించి వాటి ఉపయోగాలు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎం వేణుగోపాల్‌రెడ్డి, డిఆర్వో ఎన్ సత్యనారాయణ, ఆయుష్ ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టరు కె ప్రసాదరావు, వ్యవసాయశాఖ జెడి గౌసియాబేగం, డిఎస్‌ఓ యాసిన్, ఎన్‌జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్‌ఎస్ హరినాధ్, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, శర్వాణి, సెయింట్ ఆన్స్ విద్యార్ధినీవిద్యార్ధులు పాల్గొన్నారు.
డీసీసీబీ సీఈవోగా ఫణికుమార్
ఏలూరు, జూన్ 21: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) సిఇఓగా వడ్డే ఫణికుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. స్ధానిక డిసిసిబి బ్యాంకులో బాధ్యతలు చేపట్టిన ఆయనను డిసిఎంఎస్ మేనేజరు ఎం వెంకటరమణ, డిసిసిబి అధికారులు శ్రీదేవి, కిరణ్మయి, శ్రీనివాస్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. సహకార రంగంలో విశేష అనుభవం ఉన్న ఫణికుమార్‌ను మూడుసంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగేలా రిజర్వుబ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. 2015 ఆగస్టులో డిసిసిబి సిఇఓగా ఉద్యోగ విరమణ చేసి ఆయనను అనంతరం బ్యాంకు ఓఎస్‌డిగా తీసుకున్నారు. రిజర్వుబ్యాంకు బోర్డు కమిటీ సిఫార్సుల మేరకు సిఇఓగా ఆయన నియామకాన్ని డిసిసిబి పాలకవర్గం ఆమోదించటంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ఎనిమిది మందికి తహసీల్దార్ పదోన్నతులు

ఏలూరు, జూన్ 21: జిల్లాకు చెందిన ఎనిమిది డిప్యూటీ తహసిల్దార్లకు తహసిల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన డిప్యూటీ తహసిల్దార్లు కెవివి సత్యనారాయణ, పిఎన్‌డి ప్రసాద్, బివి రామకృష్ణ, పిఎస్‌ఎస్ లక్ష్మి, ఎండి మసూద్ ఆలీ, ఎస్ శ్రీనివాసరావు, సి రాజశేఖర్‌రాయుడు, వైఎస్ ప్రకాశరావులకు తహసిల్దార్లుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం వీరంతా సిఆర్‌డిఎలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. పదోన్నతి పొందినవారిలో అయిదుగురు తహసిల్దార్లు జిల్లాకు అలాట్ అవుతారని భావిస్తున్నారు.