పశ్చిమగోదావరి

రూ.50 కోట్లతో చలివేంద్రాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో రోజు రోజుకూ ఎండ తీవ్రత అధికం కావడంతో ప్రజలకు రక్షిత మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించేందుకు రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దయెత్తున చలివేంద్రాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత చెప్పారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం మంత్రి సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, వడగాడ్పులు వీస్తున్నాయని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 4 గంటలు దాటిన తరువాత తమ పనులు చూసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఎండలో తిరగవద్దని హితవు పలికారు. ఎండతీవ్రత నుండి ప్రజలను కాపాడేందుకే ముఖ్యమంత్రి చలివేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, ఈ చలివేంద్రాలలో మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సైతం పంపిణీ చేసేందుకు బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా జిల్లాకు మూడు కోట్ల రూపాయల నిధులు కేటాయించారని చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా దాతలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వహించాలన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురికాకుండా ప్రతి కుటుంబం జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండలో బయటకు వెళ్ళవలసి వస్తే తలపై టోపీగాని, వస్త్రం గాని కప్పుకోవాలని సూచించారు. ఏజన్సీ ప్రాంతంలోని గిరిజనులు నిత్యావసర వస్తువుల కోసం తరచు పట్టణానికి వస్తుంటారని, వారికి మజ్జిగ, చల్లని తాగునీరు అందించాలని దాతలను కోరారు. అనంతరం మజ్జిగ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం.రామారావు, సహాయ అధికారిణి ఎ.లక్ష్మి, డిఎస్పీ జె వెంకటరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా, జిల్లా ఉపాధ్యక్షుడు పెనుమర్తి రామ్‌కుమార్, జిల్లా కార్యదర్శి నంబూరి రామచంద్రరాజు, జిల్లా నాయకులు రాజాన సత్యనారాయణ, దల్లి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చాబత్తుల మరియ, తూటికుంట దుర్గారావు, తహసీల్దారు జివివి సత్యనారాయణ, ఎంపిడిఒ పి శ్రీదేవి పాల్గొన్నారు.