పశ్చిమగోదావరి

చిరస్థాయిగా నిలిచే అన్నక్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 16 : పేదలకు మూడు పూట్లా టిఫిన్, భోజనం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఏలూరు ఎంపి మాగంటి బాబు తెలిపారు. స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను సోమవారం ఆయన నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్‌టి ఆర్ పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం పధకాన్ని తీసుకువస్తూ దానికి మించి కేవలం అయిదు రూపాయలకే భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న సి ఎం నారా చంద్రబాబునాయుడు ప్రజల్లో శాశ్వత కీర్తిని గడిస్తున్నారన్నారు. అన్న క్యాంటీన్‌లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో కేవలం 5 రూపాయలకు ఎంతో శుభ్రతతో వడ్డించడం అభినందనీయమన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా అందిస్తున్న ఆహారాన్ని ఆయా కుటుంబాల్లో పుట్టిన రోజులు, పెళ్లి రోజున ఆ సొమ్ము వాటికి చెల్లించడం ద్వారా పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందించవచ్చునన్నారు. సోమవారం కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు దంపతులు భోజనాలకు చెల్లించవల్సిన నామమాత్రపు రుసుమును వారే చెల్లించి వచ్చిన వారికి ఉచితంగా భోజనాలు అందించడం అభినందనీయమన్నారు. తన తండ్రి మాగంటి రవీంధ్రనాధ్ చౌదరి పుట్టిన రోజు అయిన ఆగస్టు 7వ తేదీన తాము కూడా ఆ రోజున అన్న క్యాంటీన్‌కు వచ్చి వారికి ఉచితంగా ఆహార పదార్ధాలను అందిస్తామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్‌లో ఎయిర్ కండీషన్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో షేక్ నూర్జహాన్, నగరపాలక సంస్థ కమిషనర్ మోహనరావు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, సెన్సార్ బోర్డు సభ్యులు గుత్తా చంద్రశేఖరరావుతోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కొవ్వూరు, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలందరికీ అందజేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో గ్రామ దర్శిని- గ్రామ వికాస్ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని సందర్శించి గ్రామ సమస్యలు సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ హయాంలో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గూర్చి, తదుపరి చేపట్టనున్న అభివృద్ధి పనుల గూర్చి గ్రామస్థులకు వివరించటంతోపాటు గ్రామస్థాయి సమావేశాలను వివరించి, గ్రామస్థుల నుంచి వినతులను స్వీకరించి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. ఆరికిరేవుల గ్రామాన్ని రూ.4కోట్లతో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. భూగర్భ డ్రెయినేజీకి రూ.3కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సిహెచ్ పాపారావు, ఎంపీపీ జి రాజ్యలక్ష్మి, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్న, టీడీపీ నేతలు జెవిఎస్ చౌదరి, బివి రాఘవులు, ఎం కళాధర్ చక్రవర్తి, యనమదల సుబ్రహ్మణ్యం, వై శివరామకృష్ణ, చావా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.