పశ్చిమగోదావరి

కాలువ పనులు జరిగేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, ఏప్రిల్ 24: ప్రస్తుత వేసవిలో కాలువ పనులు జరిగే సూచనలు కనిపించటంలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ (ఒఅండ్‌ఎం) నిధులు విడుదల చేయలేదని నీటి సంఘాలు చెబుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి కాలువలు కేవలం 35 రోజులు మాత్రమే కట్టి పనులు చేస్తామని ప్రకటించారు. అయితే కాలువలకు నీరు వచ్చే ముందు గ్రాంటు ఇవ్వటం, ఒక పక్క నీరు వస్తుండగా పనులు చేయటం వల్ల నాణ్యత కొరవడుతోందని ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది కూడా ఒక పక్క కాలువకు పూర్తిస్థాయిలో నీరు వస్తుంటే, అప్పుడు సిమెంట్ పనులు చేసి పశ్చిమ డెల్టాలో చరిత్ర సృష్టించారు. ఫలితంగా వాటి వెనుక మట్టిపని మాత్రం చేయలేదు. ప్రతి ఏడాది ఒఅండ్‌ఎం గ్రాంటుకింద ఆయకట్టు పన్నులు వసూలు లెక్కన నిధులు విడుదలవుతుంటాయి. అయితే కాలువలకు నీరు వచ్చే ముందు విడుదలైన నిధులతో పనులు కూడా పూర్తిగా చేయించలేక పోతున్నారు. దీంతో నిధులు కూడా నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈసారైనా నిధులు ముందు ఇచ్చి ఉంటే బాగుండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపాదనలు సిద్ధం
ఉండి సబ్ డివిజన్ పరిధిలో ఒ అండ్ ఎం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసినట్లు ఉండి డిసి ఛైర్మన్ తోట ఫణిబాబు చెప్పారు. అయితే ప్రభుత్వం ఇంకా పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సి ఉందన్నారు.
నిరుపయోగంగా మారుతున్న రిటైనింగ్ వాల్స్
ఉండి కాలువకు కలిసిపూడి నుండి చెరుకువాడ వరకు ఎడమగట్టు పూర్తిగా కోతకు గురవుతోంది. దీంతో అక్కడక్కడ రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తున్నారు. వాటిని సంపూర్ణంగా చేయకపోవటం వలన తిరిగి నీరు గోడల వెనుకకు వెళ్ళి నిరుపయోగంగా మారుతోంది. అధికారులు హడావుడి పనుల వల్ల ఈవిధంగా జరుగుతోంది. గత ఏడాది కూడా మట్టి పని సక్రమంగా జరగలేదు. ఇళ్ళ వద్ద ఉన్నవారు చెత్తతీసుకొచ్చి పూడ్చుకోవలసి వచ్చింది. ఉండి పరిధిలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. నిధులు చివరి నిముషంలో విడుదల చేయటం, పనులు కూడా కాలువలకు నీరు వచ్చే ముందు చేపట్టడం వలన ఈ దుస్థితి ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో అలా జరగకుండా చూడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.