పశ్చిమగోదావరి

విమానాశ్రయవాసులకు పట్టాలుసాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 10: సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విమానాశ్రయ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు పంపిణీ, ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధిస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా లబ్ధిదారులకు పట్టాలు సాధించి తీరుతామని, అవసరమైతే లబ్ధిదారులతో అమరావతిలో ఉద్యమం చేస్తామన్నారు. విమానాశ్రయ భూములకు పట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు జీవోలను జారీ చేయించామన్నారు. తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములకు పట్టాలు మంజూరు అంశమని జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ దరఖాస్తుదారులకు పట్టాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విలువైన భూములు కాబట్టి క్రమబద్దీకరించడం కుదరదని సంక్షిప్త సందేశాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుదేనని ఎమ్మెల్యే మాణిక్యాలరావు స్పష్టం చేశారు. ఫ్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కోసం మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి కృషి చేస్తున్నానని, దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఏలూరులో వైద్య కళాశఋ౎లకు తాము వ్యతిరేకం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ పోతుల అన్నవనరం, బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త నరిశే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణాధ్యక్షులు కర్రి ప్రభాకర బాలాజీ, మున్సిపల్ కౌన్సిలర్ కోట రాంబాబు, జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమ్మమ్మగారి ఇంట్లో కొద్దిసేపు
మొగల్తూరు, ఆగస్టు 10: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయన అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం 20 నిమిషాలపాటు గడిపారు. బాల్యంలో అక్కడ గడిపిన రోజులను ఆ ఇంట్లోవారితో పంచుకున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ శుక్రవారం జిల్లాలోని మొగల్తూరు గ్రామానికి చేరుకున్నారు. పవన్ అమ్మమ్మ గారి ఊరు మొగల్తూరు. ఈ సందర్భంగా స్థానిక పాత కాలువ సెంటర్లోగల ఆయన అమ్మమ్మ గారి ఇంటిని సందర్శించిన ఆయన ఆ ఇంట్లో ఉన్నవారితో కొద్ది సమయం గడిపారు. ఇంటి లోపల, వెలుపల గల పరిస్థితులను చూసి బాల్యంలో తన తల్లితో కలిసి ఉన్న గత స్మృతులను గుర్తుతెచ్చుకున్నారు. తాను అయిదవ తరగతి చదువుతున్న సమయంలో అమ్మతో కలిసి తన అమ్మమ్మగారింటికి వచ్చానని చెప్పారు. ఇప్పటికీ ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని ఆ ఇంట్లో ఉన్నవారితో పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు ఆ ఇంట్లో గడిపన పవన్ ఆ తర్వాత పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా పోరాట యాత్ర నరసాపురం వైపు కదిలారు. జన సేన యాత్రకు పిలుపు లేకుండానే అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావటంతో వివిధ రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
భీమడోలు, ఆగస్టు 10 : జాతీయ రహదారిపై పూళ్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కాగుపాడు గ్రామానికి చెందిన సర్వసిద్ధి సత్యనారాయణ (30) తన స్నేహితుడు ఈపు శ్రీనివాసరావు (40)తో కలిసి పొలసానిపల్లిలోని తనసోదరి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై కాగుపాడునుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో పూళ్ల సమీపంలో తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళుతున్న లారీ వారి మోటారు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. సుమారు అరకిలోమీటరు దూరం వారిని ఈడ్చుకుపోయింది. ఈ సంఘటనలో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలిలోనే మృతిచెందారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. సంఘటనాస్థలాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సందర్శించారు. మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం చేయాలని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వైద్యులను కోరారు. మృతులకు చం6దన్న బీమాతోపాటు వారు టిడిపి కార్యకర్తలుగా భీమా చేసిన మొత్తాలను వెంటనే అందజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.