పశ్చిమగోదావరి

పథకాల అమలు తీరుపై 13 నుండి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 10: నిరుపేదలకు ఉద్దేశించిన రాష్ట్రప్రభుత్వ పధకాలు క్షేత్రస్ధాయిలో ఏమేరకు లబ్దిదారులకు అందుతున్నాయనే అంశంపై ఈనెల 13నుంచి 18వ తేదీవరకు ఏసియా కాంపిటిటివ్‌నెస్ ఇనిస్టిట్యూట్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో శుక్రవారం రాష్ట్రప్రభుత్వ పధకాల క్షేత్రస్ధాయి అమలుతీరును సమీక్షించి ప్రభుత్వానికి నివేదికను అందించటంలో భాగంగా ఏసియా కాంపిటిటివ్‌నెస్ ఇనిస్టిట్యూట్, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నోడల్ అధికారులు, ఎన్యుమరేటర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో క్షేత్రస్ధాయిలో పధకాల అమలుపై ప్రజల నుండి ప్రశ్నల రూపంలో అభిప్రాయాలను ఈ బృందం సేకరిస్తుందన్నారు. జిల్లాలో 1391 కుటుంబాల నుండి సేకరించే అభిప్రాయాలలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో 230, పట్టణ ప్రాంతంలో 40 ఎస్సీ కుటుంబాల నుండి, గ్రామీణ ప్రాంతంలో 43, పట్టణ ప్రాంతంలో 40 ఎస్టీ కుటుంబాల నుండి, గ్రామీణ ప్రాంతంలో 806, పట్టణ ప్రాంతంలో 232వార్డుల నుండి మైనార్టీ తదితర కుటుంబాల నుండి అభిప్రాయాలను సేకరిస్తారన్నారు. సర్వే చేసే సమయంలో ప్రజల నుండి సమాధానాలు రాబట్టడంలో ఎన్యుమరేటర్లకు ఓపిక అవసరమన్నారు. జిల్లాలో చేపట్టే సర్వేకు అవసరమైన 4జి నెట్‌వర్కు అందుబాటులో ఉందని, దీనిమూలంగా సంబంధిత యాప్‌లో అప్‌లోడింగ్ సులభతరమవుతుందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌నకు చెందిన ప్రొఫెసర్ టాన్‌కీ గీప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తమ సంస్ధలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని, ప్రభుత్వపధకాల అమలుతీరును సర్వే చేసి వచ్చే మార్చిలోపు నివేదికలు అందించటం జరుగుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 661 మండలాల్లో ఒక్కొక్క గ్రామం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 268 వార్డులలో కలిపి మొత్తం 17వేల 433 కుటుంబాలను శాంపిల్ సర్వే చేస్తామన్నారు. పిజి తదితర విద్యార్ధుల ద్వారా ఎంపిక చేసిన ప్రతిమండలంలోను, గ్రామపంచాయితీ, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో సర్వే నిర్వహిస్తామన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ రీసెర్చ్ అసిస్టెంట్ లిం తాయోఇ మాట్లాడుతూ ఆర్‌ఓఎంఎం సర్వేలో తేలిన ఫలితాలను కీ ఫెర్మారెన్స్ ఇండికేటర్స్ ద్వారా పనితీరు సూచకలను రాష్ట్రప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రూపొందించిన మొబైల్ యాప్‌తో సర్వే నిర్వహించి యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా 24 ప్రభుత్వశాఖలకు సంబంధించిన పనితీరును మూడుదశలలో మూల్యాంకన చేయటం జరుగుతుందని, దీనిని కూడా వచ్చే మార్చి నాటికి పూర్తిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ జాయింట్ డైరెక్టరు కోదండరాం మాట్లాడుతూ ఈసర్వేకి సంబంధించి అయా జిల్లాల్లో జనాభా ప్రాతిపదికను కొన్ని గ్రామాలను శాంపిల్ సర్వేకు సిపిఓలు రూపొందిస్తారని, ఆమేరకు ఆ ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్రామం సర్వేకు 5వేల రూపాయలు, అర్బన్ ప్రాంతంలో వార్డుకు 4వేల రూపాయలు చొప్పున ఎన్యుమరేటర్లకు గౌరవ పారితోషికం అందిస్తామన్నారు. సమావేశంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ రీసెర్జీ ఫెలోషిప్‌లు డాక్టరు జాంగ్ జయాయో, రీసెర్చ్ అసిస్టెంట్ జిగ్యాయశర్మ, కన్సల్టెంట్ సీతాలు, తుళ్లిక, ప్రణాళికశాఖ డిప్యూటీ డైరెక్టరు త్రినాధ్, ఎడి సుధాకరరెడ్డి, సిపిఓ సురేష్‌కుమార్, పలు విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పాల్గొన్నారు.

అభివృద్ధి ఫలాలు అందించేందుకే గ్రామదర్శిని
చాగల్లు, ఆగస్టు 10: ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించేందుకే ప్రభుత్వం గ్రామదర్శిని నిర్వహిస్తోందని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్లవరం పంచాయితీలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో 324 పనులకు రూ. 80 లక్షలు వెచ్చించామని, త్వరలో రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. అనంతరం పంచాయితీ సిబ్బందికి యూనిఫారం, గుర్తింపుకార్డులు అందించారు. కార్యక్రమంలో ఎంపిడివో కె పురుషోత్తమరావు, తహసీల్దారు ఎం మెరికమ్మ, ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్నా, టీడీపీ నాయకులు కోడూరి రంగారావు, కె కాశీ గంగాధరరావు, కంటిపూడి శ్రీరామ్మూర్తి, కరుటూరి సతీష్, మండల టీడీపీ అధ్యక్షుడు బొడ్డు రాజు, ఎంపీటీసీ కె లక్ష్మీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.