పశ్చిమగోదావరి

మహిళలకు ప్రత్యేకంగా పెట్రోలు పంపు ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 16: జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న హెచ్‌పిసీఎల్ పెట్రోలు బంకులో మహిళల సౌకర్యార్ధం పెట్రోల్ పంపును ఏర్పాటు చేశారు. హెచ్‌పిసీఎల్ సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ మేనేజర్ నరసింహ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. మహిళా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ బంకులో వి శాటిలైట్ ద్వారా 24 గంటలు కంపెనీ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఎస్‌ఎంఎస్ సదుపాయం, ఆన్‌లైన్ బిల్లింగ్, వినియోగదారులకు పూర్తి క్వాలిటీతో పెట్రోలు అందించడం వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. అధీకృత డీలర్ ఎం. హరి పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ బలోపేతానికి ప్రణాళిక
ఏలూరు, ఆగస్టు 16: జిల్లాలో యువజన కాంగ్రెస్‌ను అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఊట్ల వరప్రసాద్ తెలిపారు. స్ధానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశానికి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీలోగా అన్ని నియోజకవర్గాల్లోనూ యువజన కమిటీలను ఏర్పాటుచేయాలని, ఉత్సాహంగా పనిచేసే మహిళలను కూడా తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ మొదటివారంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని నిర్ణయించామని, ఈలోగా కమిటీల నియామకం పూర్తికావాలన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా, ఎపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు తొలి సంతకం చేస్తానని ప్రకటించిన రాహుల్‌గాంధీ ఉద్దేశ్యాలను ప్రచారం చేయాలన్నారు. రానున్నరోజుల్లో కాంగ్రెస్‌కు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. సమాజంలో 40శాతం ఓటర్లు యువజనులే ఉన్నారని, వారిలో మార్పు తీసుకువస్తే పార్టీ విజయం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు, పిసిసి ప్రతినిధి రాజనాల రామ్మోహనరావు, కొవ్వూరు, గోపాలపురం, ఏలూరు, చింతలపూడి, నిడదవోలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ట్రావెల్ బస్సును ఢీకొన్న వ్యాన్ ఏడుగురికి గాయాలు
ఏలూరు, ఆగస్టు 16: ట్రావెల్ బస్సును వ్యాన్ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బుధవారం రాత్రి ఏలూరు నుంచి విజయవాడ వెళ్తూ కలపర్రు టోల్‌గేట్ వద్ద భోజనాలు చేసేందుకు బస్సును మలుపుతిప్పుతుండగా విజయవాడ నుంచి వస్తున్న ఒక డిసిఎం వ్యాన్ బస్సు వెనుకభాగంలో ఢీకొంది. ఈప్రమాదంలో ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న చాటపర్రు రోడ్డునకు చెందిన ఎస్ చంద్రశ్రీకాంత్, చింతలపూడి దుర్గాఈశ్వరప్రసాద్, రెడ్డి వెంకటేశ్వరరావు, షేక్ జయరూరె, కేల శ్రీను, అతని భార్య లక్ష్మిదుర్గ, చిన్నారి పాపకు గాయాలయ్యాయి. వెంటనే హైవే పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.