పశ్చిమగోదావరి

జిల్లాలో భయం...్భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 20: ఇదెక్కడి వానరా బాబూ... అని అనుకుంటూనే ఉన్నారు జనం ఈలోగా వరద ముంచుకొచ్చేసింది. గోదావరి రెండు,మూడురోజుల నుంచి ఉగ్రరూపం దాలుస్తూ ఏజన్సీ ప్రాంతాన్ని దాదాపుగా అతలాకుతలం చేస్తున్న వైనం తెల్సిందే. తాజా పరిస్దితులు చూస్తే మాత్రం మరింత భయానకమైన పరిస్ధితి వైపే పరిణామాలు దారితీస్తున్నట్లు కన్పిస్తోంది. ఏజన్సీలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతో గ్రామాలన్నింటిని ఏకం చేసేసి, చాలా కుటుంబాలకు బయటప్రపంచంతో సంబంధాలను తెగిపోయేలా చేసింది. జల్లేరు, బైనేరు వంటి వాగులు ఉగ్రరూపం దాల్చి భారీమొత్తంలో వరదనీటిని తీసుకువచ్చి ఎర్రకాల్వలో కలిపివేయటంతో ఇప్పుడు ఎర్రకాల్వ పూర్తిస్ధాయిలో విరుచుకుపడుతోంది. ఈఫలితంగా తాడేపల్లిగూడెం, నిడదవోలు పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా భయం గుప్పెట్లో చిక్కుకుపోయాయి. ఎక్కడికక్కడ ప్రధానరహదారులపై కూడా అడుగుల లెక్క వరదనీరు ప్రవహిస్తుండటంతో వీటిపై రాకపోకలు కూడా సాధ్యం కాని పరిస్దితి నెలకొంది. ఈకారణంగా గుండుగొలను నుంచి కొవ్వూరు వైపు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయే పరిస్ధితి నెలకొంది. వీటికితోడు తాజాగా చింతలపూడి వద్ద నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్‌కు భారీమొత్తంలో వరదనీరు వచ్చి చేరడంతో అక్కడ నుంచి ఎక్కువమొత్తంలోనే వరదనీటిని కిందకు వదిలివేస్తున్నారు. దీంతో తమ్మిలేరు పూర్తిస్ధాయిలో ఉగ్రరూపం దాల్చింది. ఈకారణంగా ఏలూరు, దెందులూరు మండలాలు ఇప్పుడు వరదముంపు అంచులో కొనసాగుతున్నాయి. ఏలూరులోని శనివారపుపేట కాజ్‌వే, శ్రీపర్రు కాజ్‌వేలు పూర్తిగా తమ్మిలేరు వరదనీటిలో చిక్కుకుపోయాయి. దీంతో కైకలూరు వైపు వెళ్లే వాహనాలు చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్దితి తలెత్తింది. ఇక దెందులూరు మండలంలోనూ పరిస్దితి క్రమంగా ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిప్రాంతాల్లోకి ఇప్పటికే వరదనీరు వచ్చి చేరుతున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా యంత్రాంగం ఈపరిస్ధితిని పరిగణనలోకి తీసుకుని పూర్తిస్ధాయిలో అప్రమత్తమైంది. సహాయక బృందాలను కూడా రప్పించేందుకు సిద్ధమైంది. అలాగే మంగళవారం కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు శెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టరు భాస్కర్, ఎస్పీ రవిప్రకాష్‌లు వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడికక్కడ పరిస్దితిని అంచనా వేస్తూ తక్షణం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఊరువాడా అన్న తేడా లేకుండా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెర్వులను తలపిస్తుండటంతో చాలాప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వేల హెక్టారులలో పంటపొలాలు నీటమునిగిపోయాయి. చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. అనంతపల్లి వద్ద రహదారిపై నాలుగువందల మీటర్ల పొడవునా దాదాపు 5 నుంచి 6 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఈరహదారిపై పూర్తిస్ధాయిలో రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు కొవ్వూరు వద్ద బ్రిడ్జిలపై నుంచి భారీవాహనాల రాకపోకలను అధికారులు నియంత్రించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద రహదారికి గండి పడింది. దీనితో ఇరువైపులా భారీగా వాహనాలు నిలచిపోయాయి. అదే విధంగా జంగారెడ్డిగూడెంలోని పురాతన వంతెన కూలిపోవడంతో రాజమండ్రి వైపు రాకపోకలు నిలచిపోయాయి. జల్లేరు ఉధృతికి యాచన్నగూడెంవద్ద వంతెనకు 30 అడుగుల గండి పడింది. ఎర్రకాలువ ఉధృతికి కరకట్లకు బీటలు పడటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కలెక్టర్, ఎస్‌పి సంఘటనా స్థలాన్ని పరిశీలించి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, తాడేపల్లిగూడెం మండలం మాదవరం వద్ద రోడ్డుపై రెండడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తుండటంతో తాళ్లపాలెం, నందమూరు, సత్యవాడ, పసలపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని అదికారులు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిగూడెం మండలంలో ఉధృతంగా యర్రకాలువ ప్రవహిస్తుండటంతో మాదవరం - నిడదవోలు మధ్యలో వున్న కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. వీరంపాలెం వద్ద గండిపడటంతో పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. అదే విదంగా భీమవరం, ఉండి, ఆకివీడు పరిసర ప్రాంతాల్లో చేపలు, రొయ్యల చెరువులు నీట మునగడంతో భారీ నష్టం సంభవిస్తుందని అంచనా వేస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో వున్న గుర్రాల వాగు పొంగడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలచిపోయాయి. పోలవరం మండలం కొత్తూరు కాజ్‌వే వద్ద 15 అడుగుల నీటి మట్టం రావడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలచిపోయాయి. ఆకివీడు మండలం అమృతనగర్ కాలనీ జలమయం కావడంతో 16 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం వద్ద కనకరాజు చెరువుకు గండిపడింది. భీమడోలులో బాలుర సాంఘిక వసతిగృహంలోకి నీరు రావడంతో అక్కడ వున్న విద్యార్ధులను బిసి వసతిగృహానికి తరలించారు. గణపవరం మండలం పిప్పర వద్ద యనమదుర్రు డ్రైన్ ఉగ్రరూపం దాల్చింది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో ఎర్రకాలువ ఉధ్రృతిలో 60 గొర్రెలు మృతిచెందాయి. టి నర్సాపురం మండలం నందమూరి విద్యాసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుండటంతో కట్ట తెగుతుందన్న భయాందోళనలో ప్రజలు చిక్కుకున్నారు. బుట్టాయిగూడెం మండలం గుబ్బలమంగమ్మ గుడి వద్ద చిక్కుకున్న వేల మంది భక్తులను సోమవారం మధ్యాహ్నం ఎన్‌డి ఆర్ ఎఫ్, రెస్క్యూ టీమ్ బృందాలు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాయి.