పశ్చిమగోదావరి

అవినీతి సామ్రాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28 : ఆయన ప్రస్థానం తాత్కాలిక చిరుద్యోగిగా ప్రారంభమైంది. మూడు దశాబ్దాల్లో చిరుద్యోగి నుంచి అధికారిగా మారిపోయారు... ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల విలువ కోట్ల రూపాయలకు చేరిపోయింది. కొద్దికాలంలోనే కోట్లకు పడగలెత్తి అదే స్థాయిలో వ్యవహారాలు నడిపిస్తున్న ఆయన వ్యవహారంపై ఎసిబి అధికారులకు ఫిర్యాదులు రావడం, వారు రంగంలోకి దిగి సోదాలు జరిపారు. ప్రాధమికంగానే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే పది కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు వున్నట్లు గుర్తించారు. అయితే వీరి పరిశీలనలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. చివరకు ఈ అక్రమాస్తుల విలువ ఏ స్థాయికి చేరుతుందో వేచి చూడాల్సిందే... ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఏలూరు కార్పొరేషన్‌లో డి ఇగా పనిచేస్తున్న వంగపండు సత్యనారాయణ గురించి. ఆయన ఇంటిపైన, బంధువుల ఇళ్లపైనా, ఆస్తులపైనా ఏలూరులో అయిదు చోట్లా, గుడివాడలో రెండు చోట్లా ఎసిబి అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఎసిబి డి ఎస్‌పి కె రాజేంద్ర ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ యుజె విల్సన్, ఇతర సిబ్బంది ఈ దాడులను నిర్వహించారు.
ఇక వివరాలు చూస్తే కొంత ఆశ్చర్యం కలగకమానదు. వంగపండు సత్యనారాయణ 1980లో అప్పటి ఏలూరు మున్సిపాల్టీలో తాత్కాలిక వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరాడు. 1992 నాటికి ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయించుకోగలిగారు. ఆ తరువాత ఎ ఇగా బాధ్యతలు చేపట్టారు. 2013లో డిఇగా పదోన్నతి పొందారు. ఈ కాలంలో సత్యనారాయణ ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు, కొవ్వూరు, పిఠాపురం మున్సిపాల్టీల్లో పనిచేశారు. అయితే ఎక్కువ కాలం ఏలూరు కేంద్రంగానే ఆయన విధులు నిర్వహించడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన అక్రమాస్తులను భారీగా కూడబెట్టినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఎసిబి అధికారులు నేరుగా రంగంలోకి దిగి ఆరా తీస్తే ప్రాధమికంగానే భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. గురువారం ఎసిబి అధికారులు ఏలూరులో అయిదు చోట్ల దాడులు నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్ ఆర్ పేటలో ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంటులో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. వాటి ప్రకారం స్థానిక గులాబి తోటలో 240 గజాల ప్లాట్, ఆర్ ఆర్ పేటలో మరో అపార్ట్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు పెదపాడుమండలం కొత్తూరులో ఏడెకరాల పొలం, భార్య పేరున అక్కడి ఎస్‌బి ఐలో 12 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ వున్నట్లు గుర్తించారు. అలాగే స్థానిక అశోక్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌లో అరకేజీ నుంచి కేజీ బంగారం వున్నట్లు భావిస్తున్న ఒక లాకరు కూడా వున్నట్లు బయటపడింది. వీటితోపాటు గుడివాడలో కూడా రెండు చోట్ల ఎసిబి తనిఖీలు జరిగాయి. అక్కడ సత్యనారాయణకు బినామీలోగా భావిస్తున్న ఆయన బంధువు మూడెట్ల వెంకటలక్ష్మి, భర్త మూడెడ్ల సూర్యనారాయణ ఇంటిలోనూ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 45 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వీటి విలువలను ఇంకా లెక్కించాల్సి వుంది. వీరే కాకుండా వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేస్తున్న కె సత్యనారాయణ కూడా ఆయనకు బినామీగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై కూడా పరిశీలన జరుపుతున్నట్లు డి ఎస్‌పి తెలిపారు. ఇక అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న డి ఇ సత్యనారాయణ తన కుమారుడు ఐబి ఎంలో ఎంబి ఎ చేసేందుకు 12 లక్షల రూపాయలు, కుమార్తె ఇంజనీరింగ్ చేసేందుకు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ విధంగా వీటిని లెక్కిస్తే అధికారిక లెక్కల ప్రకారం 1.10 కోట్ల రూపాయల ఆస్తులు వున్నట్లు గుర్తించామని మార్కెట్ రేటు ప్రకారం ఇవి సుమారుగా పది కోట్ల రూపాయల వరకు విలువ చేయవచ్చునని ఎసిబి డి ఎస్‌పి కె రాజేంద్ర తెలిపారు.