పశ్చిమగోదావరి

చిన్నారులపై లైంగిక వేధింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, ఏప్రిల్ 28: మతం ముసుగులో ఒక మతబోధకుడు సహాయం చేసినట్లు నమ్మించి, మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. మండలంలోని రామన్నగూడెం గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామంలో ఒక యువకుడు సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఒక అద్దె ఇంట్లో చర్చి నిర్వహిస్తూ, చిన్నపిల్లలను సండే స్కూల్ పేరిట పాటలు, డాన్స్‌లు నేర్పించి ఆకట్టుకున్నాడు. కొన్నాళ్ల తరువాత పాస్టర్ జంగారెడ్డిగూడెంలో కూడా మతబోధనలు చేస్తూ అక్కడ పరిచయాలు పెరిగి మత సంఘం అభివృద్ధి చెందడంతో సుమారు రెండేళ్ల క్రితం మకాం జంగారెడ్డిగూడెం మార్చాడు. అప్పటి నుండీ వారానికి రెండు, మూడురోజులు మాత్రం రామన్నగూడెం చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది మైనర్ బాలురను, బాలికలను తన దగ్గర ఉంచుకుని చదివిస్తానని, తన ఇంటిలోనే భోజన సదుపాయాలు చూస్తానని, జంగారెడ్డిగూడెంలో తన ఇంటివద్దనే ఉంచుకున్నట్లు చెప్పారు. ఈరకంగా తన దగ్గర ఉన్న బాలికల్లో ఒకరిని లైంగికంగా అనుభవిస్తుండగా, ఒక బాలుడు చూసాడని, అతనిని పాస్టర్ బెదిరించినట్లు తెలిసింది. మరో బాలికను కూడ లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నంలో భయపడిన బాలిక ఇంటికి వచ్చేసింది. ఈ విషయాలన్నీ బాలబాలికలు ఒకరితో ఒకరు చెప్పుకోవడంతో విషయం బయటకు పొక్కింది. పాస్టర్ అసలురంగు బయటపడడంతో బాలికలు, బాలురు రామన్నగూడెంలో తమ ఇళ్లకు వచ్చేశారు. దీనితో ఎక్కడ తన గుట్టురట్టవుతుందోనని భయపడ్డ పాస్టర్ రామన్నగూడెం వచ్చి, బాలికల తల్లిదండ్రులను, సంరక్షుకులను కలిసి, పిల్లలను తిరిగి తనవద్దకు పంపించమని ప్రాధేయపడినట్టు సమాచారం. విషయం గ్రామమంతా పొక్కడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో గురువారం పంచాయతీ వద్ద విచారణ నిమిత్తం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కొందరు ఏలూరులోని ఛైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో హెల్ప్‌లైన్ ప్రతినిధులు సుమారు ఆరుగురు హుటాహుటిన బైకులపై రామన్నగూడెం చేరుకున్నారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకుని బాధిత బాల బాలికల వద్ద, వారి తల్లిదండ్రుల వద్ద నుండి వాంగ్మూలాలను తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హెల్ప్‌లైన్ ప్రతినిధులు జంగారెడ్డిగూడెం డిఎస్పీకి తెలిపినట్లు, ఈ బాలబాలికల్లో కొందరు తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఒక్కరు మాత్రమే ఉన్నవారు, సంరక్షకుల దగ్గర ఉన్నవారు (సెమీ ఆర్ఫన్స్) ఉన్నారు. వీరినే పాస్టర్ టార్గెట్ చేయడం గమనార్హం అని ఛైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు చెప్పారు. డిఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఎఎస్సై కె జయరావు రామన్నగూడెం వచ్చి విచారించారు. అనంతరం పాస్టర్‌ను, బాధిత బాలికలను, తల్లిదండ్రులను, సంరక్షుకులను విచారణకు బుట్టాయగూడెం పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు.
తాను సేవాతత్పరతతోనే బాలబాలికలను చేరదీసానని, తాను ఎటువంటి అకృత్యాలకు పాల్పడలేదని పాస్టర్ తెలిపారు. బాలికల్లో ఒకరు పాస్టర్ ఎటువంటి లైగింకవేధింపులకు పాల్పడలేదని చెబుతోంది. ఏదేమైనా పోలీసులు నిజాన్ని నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.