పశ్చిమగోదావరి

ఆస్తులు, బకాయిల సొమ్ము తక్షణం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఆస్తులను వెంటనే అప్పగించాలని తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విద్యుత్తు బకాయిల సొమ్ము తక్షణమే చెల్లించాలని కోరుతూ జిల్లా ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్ అసోసియేషన్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఇ సత్యనారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించింది. స్థానిక ఎస్‌ఇ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొద్దిసేపు ధర్నా నిర్వహించి అనంతరం ఎస్‌ఇకి వినతిపత్రం సమర్పించారు. విద్యుత్తు ఉద్యోగుల విభజన సామరస్యంగా చేయాలని విద్యుత్తు ఆస్థులు చట్ట ప్రకారం విభజించాలని, తెలంగాణా ప్రభుత్వం రాజ్యాంగాన్ని, శాసనాలను గౌరవించాలని ఎపిఎస్‌ఇబి ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు అంబేద్కర్ డిమాండ్ చేశారు. విద్యుత్తు ఉద్యోగుల విభజన కమలనాధన్ కమిటీ ప్రకారం చేయాలని హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధాలోని 58.32 శాతం ఆస్తి వాటా 400 కోట్ల రూపాయలను, మింట్ కాంపౌండ్‌లో 26.31 శాతం వాటా 200 కోట్లు తక్షణమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు పంపిణీ సంస్థకు బదలాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు సంస్థకు సంబంధించి ఆస్థుల పంపిణీ సక్రమంగా నిర్వహించడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు సమకూరుతుందని ఆ నిధులతో అమరావతిలో విద్యుత్తు ప్రధాన కార్యాలయ భవనాలు నిర్మించుకోవడానికి వీలుంటుందని కావున ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి విద్యుత్తు ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారే. కార్యక్రమంలో ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు నాగేశ్వరరావు, వేణుగోపాల్, వీరభద్రరావు, విజయకుమార్, రమేష్, శ్రీనివాస్, ప్రణీత్, మురళీ పాల్గొన్నారు.