పశ్చిమగోదావరి

రేపు యర్రా జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 28: జిల్లా రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈ నెల 30న ఆవిష్కరించనున్నారు. వాస్తవంగా అజాత శత్రువనే పదం ఆయన కోసమే పుట్టిందోమోనని చాలా మంది వ్యాఖ్యానిస్తారు. నిస్వార్థంగా తనదైన శైలిలో సేవజేసి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ప్రజల, ప్రముఖుల, పారిశ్రామికవేత్తల, రాజకీయ ఉద్దండుల చేత శభాష్ అనిపించుకున్న ఏకైక వ్యక్తి యర్రా నారాయణస్వామి. ఆయన తండ్రి, విద్యాదాత యర్రా చంద్రరావు నారాయణ స్వామికి ఎంత ఇచ్చారో తెలియదు గానీ నీతిగా, నిజాయితీగా బతకడం మాత్రం నేర్పించారు. 85 ఏళ్ల యర్రా నారాయణస్వామి ఇప్పటికీ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి యర్రా నారాయణస్వామి జీవిత చరిత్రపై తణుకుకు చెందిన కానూరి బదిరినాథ్ పుస్తకం రాయాలని సంకల్పించారు. ఎంతో శ్రమించి యర్రా నారాయణస్వామి గురించి అనేక విషయాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ నెల 30న విద్యాదాత యర్రా చంద్రరావు 125వ జయంతోత్సవాల సందర్భంగా యర్రా నారాయణస్వామి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణోత్సవం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక భవనంలో జరగనుంది.
హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
యర్రా నారాయణస్వామి జీవిత చరిత్రపై కానూరి బదిరినాథ్ ‘అజాత శత్రువు యర్రా నారాయణస్వామి’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించనున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఆత్మీయ అతిథులు హాజరుకానున్నారు.