పశ్చిమగోదావరి

నేడు ఎంసెట్-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28: జిల్లాలో ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షను శుక్రవారం అధికారులు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు జిల్లాలోని ఏలూరు, భీమవరం పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ విద్యార్ధులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు మెడిసన్ విద్యార్ధులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 12440 మందికి జిల్లాలో 22 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏలూరులో 13 సెంటర్లకు గాను 7487 మంది, భీమవరంలో 9 సెంటర్లకు గాను 4953 మంది విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు. అదే విధంగా మెడిసన్ విభాగంలో 4177 మంది విద్యార్ధులకు 9 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏలూరులో ఆరు సెంటర్లకు గాను 2940 మంది, భీమవరంలో మూడు సెంటర్లకు గాను 1237 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. విద్యార్ధులు ఒక గంట ముందు గానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు సూచించారు.
ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి
జిల్లాలో శుక్రవారం నిర్వహించే ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు విద్యార్ధులు వారి తల్లిదండ్రులు సహకరించాలని ఏలూరు రీజియన్ ఎంసెట్ పరీక్ష నిర్వాహకులు జి సాంబశివరావు కోరారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లను తీసుకురాకూడదన్నారు. విద్యార్ధులకు సమయం తెలిసేందుకు ప్రతీ గదిలోనూ గోడగడియారాలను ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ప్రతీ 30 నిమిషాలకు ఇన్విజిలేటర్లు సమయాన్ని తెలియజేస్తారన్నారు. పరీక్షా కేంద్రంలోనికి విద్యార్ధుల హాల్ టిక్కెట్లు, పెన్నులు, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం, కులధృవీకరణ పత్రాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలవద్ద సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆపేందుకు జామర్లను ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్ధుల కోసం జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతీ పది నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులు వారికి అనువైన పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే విధంగా ఈ ఏడాది అవకాశం కల్పించామన్నారు. కావున విద్యార్ధులు తమకు సహకరించాలని కోరారు. పరీక్షకు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 6755కు ఫోన్ చేసి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అధికారులు తెలిపారు.