పశ్చిమగోదావరి

కట్టేసినా... కాలువలో నీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, ఏప్రిల్ 28: కాలువలకు నీరు కట్టెసినా కాలువలో నీటి పారుదల సాగుతోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 25న కాలువలు కట్టి వేస్తున్నట్టు ప్రకటించినా ఈ నెల 27 సాయంత్రం వరకు ఉండి సబ్‌డివిజన్ పరిధిలోని వెంకయ్య వయ్యేరు కాలువకు నీరు విడుదల చేశారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాగా, ఆ కాలువపై నీరు అవసరం ఉన్నందున మరో రెండురోజులు అదనంగా నీరు ఇచ్చినట్టు వారు చెప్పారు. దీనితో పాటు పశ్చిమ డెల్టాకు గురువారం కూడా రెండు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారని నీటి పారుదలశాఖ అధికారులు చెప్పారు. ఈ నీరు ఒక్క ఏలూరు కాలువకు మాత్రమే వెళుతున్నట్టు చెబుతున్నారు. కాలువలకు ఒక దాని నుండి మరొకదానికి హెడ్స్ దగ్గర నుండి నీరు లీకవుతూ ఉంటుందంటున్నారు. మొత్తం పశ్చిమ డెల్టాకు నీరు నిలుపుదల చేస్తే తప్ప కాలువల్లో నీరు నిలిచే పరిస్థితి ఉండదంటున్నారు. కాగా అధికారులు ఈవిధంగా కాలువలకు నీరు విడుదల చేయటం పట్ల రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో పనులు చేస్తారా! అనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.