పశ్చిమగోదావరి

జిల్లాలో వెయ్యి ప్రభుత్వ చలివేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 28: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెయ్యి మంచినీటి చలివేంద్రాలను ప్రారంభిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం ఉదయం మండల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మంచినీటి చలివేంద్రాలు, భూ రికార్డులు తదితర అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్ర విపత్తు నివారణా శాఖ ఆధ్వర్యంలో ప్రతీ పల్లెలో జనసమర్ధం ఉండే ప్రాంతాలలో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజల దాహార్తిని తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు జిల్లాలోని ప్రతీ మండలంలో కనీసం 20కు తగ్గకుండా మంచినీటి చలివేంద్రాలను ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభించాలని తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో ప్రకృతి సిద్ధంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ఇసుక మధ్యన కుండలు ఏర్పాటుచేసి సహజ సిద్ధమైన చల్లని తాగునీరు ప్రజలకు ఉచితంగా అందించడంతోపాటు మజ్జిగ సరఫరా కూడా ఉచితంగా నిర్వహించాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వపరంగా నిర్వహించే చలివేంద్రాలలో విధిగా వి ఆర్ ఏ లేదా ఆయా గ్రామాల్లోని ఇతర శాఖల ఉద్యోగులను ఉండాలని, వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని కోరారు. ప్యాకెట్లు ద్వారా నీరు సరఫరా చేయవద్దని కుండలలో నీటిని మాత్రమే ప్రజలకు అందించాలని ఈ నీరు ఎంతో శ్రేష్టమైనదని చెప్పారు. ఆర్భాటంగా చలివేంద్రాలు ప్రారంభించి మరుసటి రోజునే మూతవేసే పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి వుంటుందని జిల్లాలో పట్టాదారు పాస్‌పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో కూడా వెనుకబడిన మండలాలు తక్షణమే ఆధార్ సీడింగ్ పూర్తి చేసి రెవిన్యూ సేవలు ప్రజలందకించే అన్ని విషయాలలో పశ్చిమగోదావరి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా చూడాలని చెప్పారు. జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో కూడా వెనుకబడిన మండలాలు తక్షణమే ఆధార్ సీడింగ్ పూర్తి చేసి రెవిన్యూ సేవలు ప్రజలకందించే అన్ని విషయాలలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా చూడాలన్నారు. జిల్లాలో 20 వేల కార్డులకు బెస్ట్ ఫింగర్ డిటెక్షన్ చేయాల్సి వుందని వీటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో నీటి పన్ను వసూళ్లు ఆశాజనకంగా లేదని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా సంబంధిత రైతులకు సొమ్ములు చెల్లించినప్పటికీ నీటి పన్నులు సక్రమంగా వసూలు చేయకపోవడానికి గల కారణమేమిటని అధికారులను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. మొగల్తూరు మండలంలో కోటీ 22 లక్షల రూపాయలు, వీరవాసరం మండలంలో కోటీ 12 లక్షలు, గణపవరం మండలంలో కోటీ 30 లక్షల రూపాయల వరకూ నీటి పన్నులు కాయిలు పెండింగ్‌లో వున్నాయని వచ్చే శనివారం నాటికి నీటి పన్ను వసూళ్లలో ప్రగతి కనిపించకపోతే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. మీ-సేవా సెంటర్లపై అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలని అన్నారు. చాలా చోట్ల మీ-సేవ కేంద్రాల్లో బినామీలు పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని, బినామీలు లేకుండా మీ-సేవా కేంద్రాలను నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మీ-సేవ ద్వారా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు సంబంధితాధికారులకు పంపించాలని ఆయన చెప్పారు. ఉండిలో ఉన్న మీ-సేవ కేంద్రం సక్రమంగా తెరవకపోవడం వలన ప్రజలకు ఎంతో ఇబ్బంది ఎదురవుతున్నదని తహశీల్దారు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దీనిపై జెసి స్పందిస్తూ ఎక్కడైనా మీ-సేవా కేంద్రాలు సరైన రీతిలో సేవలు అందించకపోతే వాటిని రద్దుచేసి ఉత్సాహంగా ఉండే వారికి అప్పగించాలని చెప్పారు. మీ-సేవకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ కోర్టు కేసులను కంప్యూటర్లు ద్వారా అప్‌లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాలో రేషన్ షాపులు తరచూ తనిఖీలుచేసి కార్డదారులకు సక్రమంగా రేషన్ సరుకులు సకాలంలో అందుతున్నదీ, లేనిదీ చూడాలని ఆ మేరకు తనిఖీ చేసిన నివేదిక ఎప్పటికప్పుడు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుదారులకు సంబంధించి ఫోన్ నెంబర్లను సేకరించి అప్‌లోడ్ చేయాలని ఆయన చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇ-క్రాఫ్ బుకింగ్, ల్యాండ్ కన్వర్షన్, ఎల్‌ఇసి కార్డ్స్, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫఱెన్స్‌లో డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డి ఎస్‌వో కె శివశంకరరెడ్డి, ఎన్‌ఐసి అధికారి ఉదయ్‌కుమార్, శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు పాల్గొన్నారు.