పశ్చిమగోదావరి

గ్రామీణ గోదాముల నిర్మాణానికి రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 28: రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు గ్రామీణ గోడౌన్ల నిర్మాణానికి డిసిసిబి ద్వారా రుణాలు ఇస్తున్నట్టు ఆ బ్యాంకు ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) తెలిపారు. మండలంలోని జి కొత్తపల్లిలో పిఎసిఎస్ నూతన భవనాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే గొడౌన్లను డిసిఎంఎస్ ఛైర్మన్ భూపతిరాజు రవివర్మ, కౌంటర్‌ను డిసిసిబి ఒఎస్‌డి వివిఎన్ ఫణికుమార్, స్ట్రాంగ్ రూమ్‌ను ఆల్డా ఛైర్మన్ పి గాంధీ ప్రారంభించారు. అనంతరం ఆ సంఘ అధ్యక్షుడు చెలికాని రాజమోహనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ గ్రామీణ గొడౌన్ల నిర్మాణానికి సబ్సిడీ ఉంటుందని, 10నుండి 20 శాతం మార్జిన్ మనీ ఉంటుందన్నారు.. కార్యక్రమంలో రామతిరుపతిరెడ్డి, రాజేంద్రబాబు, గంజి ప్రసాద్, ముప్పిడి సంపత్‌కుమార్, తూంపాటి సత్యనారాయణ, దాసరి ఏసురత్నం పాల్గొన్నారు.
రెండో విడత రుణమాఫీ జాబితాలు సిద్ధం
పెరవలి: జిల్లాలో సహకార సంఘాల్లో రెండో విడత రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలు సిద్ధమయ్యాయని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) అన్నారు. మండలంలోని పిట్టల వేమవరంలో గురువారం సొసైటీ నూతన భవన ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రుణమాఫీకి అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదలకు సిద్ధంగా ఉంచిందన్నారు. నిధులు అందిన వెంటనే రైతుల ఖాతాల్లో జమఅవుతాయన్నారు. అంతకు ముందు ఇక్కడ రూ.30 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనాన్ని నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి రత్నం ప్రారంభించారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ భూపతిరాజు రవివర్మ, జడ్పీటిసి అటికాల రమ్యశ్రీ, ఎంపిడివో రాజేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు మండా తాతారెడ్డి, గ్రామ సర్పంచ్ కొవ్వూరి సర్వోత్తమరెడ్డి, సొసైటీ కార్యదర్శి కోనాల సుబ్బారెడ్డి పాల్గొన్నారు.