పశ్చిమగోదావరి

క్రీడల్లో రాణిస్తేనే దేశానికి ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, సెప్టెంబర్ 25: క్రీడల్లో రాణిస్తేనే దేశానికి ఖ్యాతి వస్తుందని నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఆసియా రోలర్ స్కేటింగ్‌లో రజత పతకాన్ని సాధించిన ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు మహేష్‌వర్మకు ఆకివీడులో మంగళవారం ఘన సన్మానం జరిగింది. ఆకివీడు ఐఎంఎ, లయన్స్ క్లబ్, అభయ, లియోక్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీ గంగరాజు మాట్లాడుతూ చిన్న దేశాలు సైతం క్రీడల్లో బంగారు పతకాలు సాధిస్తున్నాయంటే వాటికి ప్రోత్సాహం కలగడమేనన్నారు. ఆయా దేశాలకు దీటుగా మనం పతకాలు సాధించలేకపోవడం సిగ్గుచేటన్నారు. కష్టపడి పతకాలు సాధించిన వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నాయన్నారు. ప్రతి మండలంలోను స్టేడియంలు ఏర్పాటు చేయడానికి సంకల్పించడం శుభపరిణామమన్నారు. మహేష్‌వర్మను ఆయన ఈ సందర్భంగా ప్రశంసలతో ముంచెత్తారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు. మహేష్‌వర్మకు కావాల్సిన ప్రోత్సాహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పిస్తానన్నారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ క్రీడల్లో రాణించి, ఈ ప్రాంతానికి మహేష్‌వర్మ ఎంతో విలువ తెచ్చారన్నారు. అనంతరం మహేష్‌వర్మ, ప్రణీత దంపతులకు ఎంపీ గోకరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎంవీ సూర్యనారాయణరాజు, సాగి రామరాజు, ప్రతాప్‌కుమార్, మాధవి, రాధాకృష్ణ, బీజేపీ నాయకులు నేరెళ్ల పెదబాబు, నరహరిశెట్టి నానాజీ, యర్రా రఘు, జెఎస్‌ఆర్, అల్లూరి సత్యనారాయణరాజు, బొబ్బిలి బంగారయ్య, డివి రమణమూర్తి, తస్సేల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

రేపు మంత్రి పరిటాల సునీత రాక
ఏలూరు, సెప్టెంబర్ 25 : రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, సెర్ఫ్, వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఈ నెల 27న ఉదయం 8 గంటలకు రాజమండ్రి నుండి బయలుదేరి ఉదయం 10 గంటలకు వట్లూరులోని టిటిడిసి చేరుకొంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులతో సమీక్ష నిర్వహఙస్తారు. మధ్యాహ్నం భోజన విరామ అనంతరం 2 గంటల నుంచి 5 గంటల వరకూ ఐసిడి ఎస్ అదికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరు నుండి బయలుదేరి గుంటూరు వెళతారు.

ఇళ్ల స్థలాల పంపిణీకి చొరవ చూపాలి
*సీపీఎం డిమాండ్
ఆకివీడు, సెప్టెంబర్ 25: తాళ్లకోడు గ్రామంలో ఇళ్ల స్థలాలను పేదలకు పంచడంలో ఎమ్మెల్యే శివరామరాజు చొరవ చూపాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కుప్పనపూడి శివారు తాళ్లకోడు ప్రాంతంలో పేదలకు కొనుగోలుచేసిన 74 ఎకరాల స్థలాన్ని ఆ పార్టీ నాయకుల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బి సత్యనారాయణ మాట్లాడుతూ సీపీఎం పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం ఈ ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేసిందన్నారు. రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజు నిర్లక్ష్యం వల్ల పేదలకు ఇళ్ల స్థలాలు దక్కలేదన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కొంత చొరవచూపి స్థలాలు ప్లాట్లుగా విభజించే పని చేపట్టినా నత్తనడకన పనులు సాగుతున్నాయన్నారు. నెల రోజుల్లోగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్లులేని వారంతా స్థలాలు పంచుకుంటారని ఆయన హెచ్చరించారు. అటువంటి పరిస్థితిని ఎమ్మెల్యే, అధికారులు రప్పించుకోవద్దని హితవుపలికారు. సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు బైరి ఆంజనేయులు, గేదెల అప్పారావు మట్లాడుతూ వెంకయ్య వయ్యేరు కాలువపై వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై నెల రోజులపైనే కావస్తున్నా ఒక్క అంగుళం కూడా పని జరగలేదని విమర్శించారు. గతంలో ఇచ్చిన పట్టాలపై సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. ఇళ్లులేని వారందరికీ స్థలాలు పంపిణీ జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు షేక్ వల్లీ, పి అప్పారావు, సందక అప్పారావు, డోకల రవితేజ తదితరులు పాల్గొన్నారు.