పశ్చిమగోదావరి

చిరంజీవి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, ఏప్రిల్ 28: చిరంజీవి 150వ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరుగుతుందని సినీ దర్శకుడు వివి వినాయక్ వెల్లడించారు. గురువారం చాగల్లులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చిరంజీవి తనపై ఎంతో నమ్మకం ఉంచి ఇచ్చిన దర్శకత్వ బాధ్యత అప్పగించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. దాదాపు 6 సంవత్సరాల తరువాత కొత్తదనంతో ప్రత్యేక తరహాలో పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా సందేశాత్మక చిత్రాన్ని రూపొంచనున్నట్టు తెలిపారు. చిరంజీవికి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం ఉంటుందన్నారు. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. నిర్మాత రామ్‌చరణ్ కాగా, సహనిర్మాత ప్రవీణ్, వాకాడ అప్పారావు అని, హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీత దర్శకులన్నారు. రానున్న సంక్రాంతికి చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చిత్రం పేరు కత్తిలాంటి వాడు పరిశీలనలో ఉందన్నారు. తాను దర్శకత్వం వహిస్తున్న ప్రతీ చిత్రం ముహూర్తం ప్రారంభానికి ముందుగా చాగల్లులో తెలగా సంఘం శ్రీ విఘ్తేశ్వరుని ఆశీస్సులు అందుకోవడంతోబాటు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది నృసింహస్వామిని దర్శంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తాను దర్శకుడు కాక ముందు స్వగ్రామమైన విఘ్నేశ్వరుని సన్నిధిలోనే తిరిగే వాడినని వినాయక్ తెలిపారు. గురువారం శ్రీవిఘ్నేశ్వర ఆలయంలో వేద పండితులు లింగాల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సహనిర్మాత ప్రవీణ్ ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, వినాయక్ అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చారు. అనంతంరం అంతర్వేది నృసింహస్వామి దర్శనార్థం తరలివెళ్లారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, అభిమాన సంఘాల నాయకులు జుట్టా కొండలరావు, దాసరి కృష్ణారావు, పిండి మంగరాజు, గవర సర్వారాయుడు , కంఠంశెట్టి సోమరాజు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.