పశ్చిమగోదావరి

రేపటి నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 28: స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో వేంచేసియున్న శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామివారి పంచమ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 30వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు తెలిపారు. గురువారం దేవస్థానం ఆవరణలో శ్రీవారి బ్రహ్మోత్సవాల పోస్టర్లను పాలకవర్గం ఆవిష్కరించింది. ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేయడం, ఉదయం 11.15 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతులమీదుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు యాగశాల ప్రవేశం, అంకురార్పణం జరుగుతాయన్నారు. మే 1వ తేదీ ఆదివారం ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, రక్షాబంధనము, దీక్షాధారణ, వాస్తు మండపారాధన, నవకుంభారోపణం, బలిహరణ, పంచగవ్యారాధాన, పంచగవ్య ప్రాశన, అగ్నిప్రతిష్ఠ, గరుడాంగ హోమం, ధ్వజారోహణం, విజయ గణపతికి అభిషేకం, గరికపూజ, సాయంత్రం 4.30 గంటలకు ప్రముఖ సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ ప్రవచనం, ఎదుర్కోలు ఉత్సవాలు, రాత్రి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. 2వ తేదీ 108 మంది ముతె్తైదువులతో శత కలశార్చన అభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు నిత్యోపాశన, బలిహరణ, తీర్థప్రసాద వినియోగం, రాత్రి గరుడోత్సవం నిర్వహిస్తారు. 3వ తేదీ సుదర్శన సహిత అష్టముఖ గంఢ భేరుంఢ లక్ష్మీ నారసింహ హోమం, అభినవ శుక, ప్రసంగ తల్లజ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ వారిచే ప్రవచనం, అల్లు వెంకట రామారావు, పద్మావతీ దంపతులచే సదస్యం - మహదాశీర్వచనం - వేద సభ జరుగుతుందన్నారు. సాయంత్రం శ్రీ స్వామివారి వైభవోత్సవం నిర్వహిస్తారన్నారు. 4వ తేదీ సామూహిక శ్రీ వేంకటేశ్వర అభీష్ట సిద్ధి వ్రతం, శ్రీ స్వామివారి రథోత్సవం జరుగుతుందన్నారు. 5వ తేదీ అభిషేకం చక్రస్నానం, ధ్వజావరోహణ, రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 8 గంటలకు పుష్పోత్సవం (పవళింపుసేవ) జరుగుతుందన్నారు. 6వ తేదీ ద్వాదశారాధన - అర్చన, శ్రీ పుష్పయాగం ద్వాదశ ప్రదక్షిణములు, ద్వాదశ ఫల నివేదన, ద్వాదశ ప్రసాద నివేదన, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థప్రసాద వినియోగం, ఆశీర్వచనములు, 7వ తేదీ ప్రధాన ఆలయాల ఛైర్మన్, కార్యనిర్వాహణాధికారులకు సన్మానములు, ఉదయం 12 గంటలకు అఖండ అన్నసమారాధన నిర్వహించనున్నట్టు కంతేటి వెంకట్రాజు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతీరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారన్నారు.