పశ్చిమగోదావరి

లాంఛనం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 29: ఏలూరు కార్పొరేషన్ వ్యవహారాలన్నీ విడ్డూరంగా కొనసాగుతున్నాయి. విమర్శలు వెల్లువెత్తినా వాటిని పక్కనపెట్టి మరీ తనదైన శైలిలోనే ముందుకు వెళుతోంది. ఇంతకుముందు లేని విధంగా ప్రస్తుత పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ పదవిని నలుగురికి పంచారు. వారిలో మొదట ఈ స్థానంలో కొలువుతీరిన చోడే వెంకటరత్నం గడువు జనవరి 2తో పూరె్తైంది. ఆ తరువాత వెంటనే రెండవ నేతగా వున్న గుడివాడ రామచంద్ర కిషోర్ డిప్యూటీ మేయర్‌గా స్థానిక మర్చంట్స్ ఛాంబర్ హాలులో ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు డిప్యూటీ మేయర్‌గా గుడివాడ రామచంద్రకిషోర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబులతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఆయన డిప్యూటీ మేయర్‌గానే కొనసాగుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఈ పరిస్థితి లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగని నేపధ్యంలో జరిగిందంతా పార్టీ పరమైన సర్దుబాటుగానే మిగిలిపోయింది. చివరకు ఆ లాంఛనాన్ని ఎట్టకేలకు దాదాపు నాల్గవ నెల పూర్తవుతుండగా కార్పొరేషన్ పూర్తి చేసింది. శుక్రవారం స్థానిక కార్పొరేషన్ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనుకున్నట్లుగానే గుడివాడ రామచంద్రకిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే నాలుగు నెలలుగా డిప్యూటీ మేయర్‌గానే వ్యవహరిస్తున్న కిషోర్‌కు ఎట్టకేలకు శుక్రవారం నాటి పరిణామాల్లో అధికారిక ముద్ర కూడా పడిందని చెప్పుకోవాలి. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నికకు నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేషన్ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జెసి కోటేశ్వరరావు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్‌గా గతంలో వ్యవహరించిన చోడే వెంకటరత్నం జనవరి 2వ తేదీన ఆ పదవికి రాజీనామా చేయగా జనవరి 3 నుండి డిప్యూటీ మేయరు స్థానానికి ఖాళీ ఏర్పడిందన్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ మేయరు ఎన్నికకు ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి 25వ తేదీన సభ్యులకు ఎన్నిక నిర్వహణపై నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఏప్రిల్ 29వ తేదీన డిప్యూటీ మేయరు ఎన్నికకు ఏర్పాటు చేసామన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 53 మంది సభ్యులు ఉండగా నేటి ఎన్నికకు 44 మంది హాజరయ్యారన్నారు. డిప్యూటీ మేయరు పదవికి 13వ వార్డుకు చెందిన కార్పొరేటర్ గుడివాడ రామచంద్రకిషోర్ మాత్రమే పోటీలో ఉండగా వేరే ఎవరూ ఈ పోటీలో లేనందున వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జెసి ప్రకటించారు. గుడివాడ రామచంద్రకిషోర్ అభ్యర్ధిత్వాన్ని 24వ వార్డు కార్పొరేటర్ గూడవల్లి శ్రీనివాస్, 16వ వార్డు కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నంలు బలపరిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయరు ఎన్నికల్లో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నగరపాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్ పాల్గొన్నారు.