పశ్చిమగోదావరి

ముగిసిన రాష్టస్థ్రాయ ఖోఖో పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 14: భీమవరం భారతీయ విద్యాభవన్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఆడుతున్న రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అండర్-17 బాలుర విభాగంలో విశాఖపట్నంకు చెందిన శ్రీ ప్రకాష్ భారతీయ విద్యాభవన్స్ జట్టు భీమవరం భారతీయ విద్యాభవన్స్ పై గెలుపొంది ప్రథమ స్థానం సాధించింది. ఇదే బాలికల విభాగంలో భీమవరం భారతీయ విద్యాభవన్స్ జట్టు నిజామాబాద్ బీవీబీ పై విజయం సాధించి ప్రథమ స్థానం సాధించింది. అండర్-19 బాలుర విభాగంలో విశాఖపట్నం శ్రీ ప్రకాష్ బీవీబీ ప్రథమ స్థానం, ఖమ్మంకు చెందిన హర్వేష్ పబ్లిక్ స్కూల్ ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో విశాఖపట్నం శ్రీ ప్రకాష్ ప్రథమ స్థానం, భీమవరం బీవీబీ ద్వితీయ స్థానం సాధించాయి. విజేతలకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, భారతీయ విద్యాభవన్స్ చైర్మన్ చెరుకువడ శ్రీరంగనాధరాజు బహుమతులు అందించారు. ప్రిన్సిపాల్ ఎల్‌వి రమాదేవి, డైరెక్టర్ బివి శేషగిరిరావు, ఖోఖో ఫెడరేషన్ సెక్రటరీ ఎం సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోరాటాల వీరుడు కామ్రేడ్ షరీఫ్
జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 14: ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే ధ్యేయంగా పేదల కోసం పని చేసిన సీనియర్ కమ్యూనిస్టు, పోరాటాల వీరుడు, యుసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ ఎస్‌జి షరీఫ్ (90) ఆదివారం మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన షరీప్ స్వగృహంలో ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పరోపకారమే పరమార్థంగా, సేవా తత్పరతలే అన్నపానీయాలుగా భావించి కమ్యూనిస్టు భావాలు నింపుకుని, సమాజానికి ఏదో చేయాలనే తపన, ఆరాటం, ఆకాంక్షలను నరనరాల్లో జీర్ణించుకుని బడుగు జీవుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, మానవత్వానికి నిర్వచనంగా చెప్పుకోదగ్గ వ్యక్తిగా మహాశక్తిగా ఎదిగిన పోరాటాల వీరుడు కామ్రేడ్ షరీఫ్. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా మొదలైన ఆయన ప్రస్థానం 1964లో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీయంగా విడిపోయిన తరువాత ఎస్‌ఎ డాంగే ముఖ్య అనుచరునిగా 1980లో ఎఐసిపిని రాష్ట్రంలో స్థాపించి పార్టీ రాష్ట్ర కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, జిల్లా కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహించారు. 1995లో ఎఐసిపి, యుసిపిఐగా మారిన దగ్గర నుండి పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా నేటికీ కొనసాగుతూనే ఉన్నారు. ఏజన్సీ ప్రాంతంలోని పలు గిరిజన సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర షరీఫ్ సొంతం. పట్టణంలో ఎప్పుడు ర్యాలీ నిర్వహించినా పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేసేవారు. షరీఫ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేసారు. షరీఫ్ అంత్యక్రియలు పట్టణంలోని ముస్లిం శ్మశానవాటికలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా తెలిపారు.
అంబేద్కర్ వారసులంతా ఏకం కావాలి
ఆచంట, అక్టోబర్ 14: కులరహిత సమాజం, బలవత్తరమైన భారతదేశం నిర్మాణం కోసం అంబేద్కర్ వారసులంతా ఏకం కావాలన్నది అంబేద్కర్ ఇండియా మిషన్ ఆశయమని, ఎఐఎం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అడిషనల్ డీజీపీ పీవీ సునీల్‌కుమార్ అన్నారు. పెనుగొండ త్యాగరాజ కళామందిర్‌లో ఆదివారం పెనుగొండ మాజీ సర్పంచ్ యాదాల ఆశాజ్యోతి, యాదాల రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 10 నుండి 35 శాతం ఓట్లు కలిగి ఉండి రాజ్యాధికారాన్ని పొందలేని దుస్థితిలో మాలలు, దళితులు, దళిత క్రైస్తవులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ళ ప్రస్థానంలో నీతి, నిజాయతీలకు మారుపేరైన సంఘంగా ఇండియా మిషన్ ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 12918 పంచాయితీలుంటే అందులో దళితులు జనాభా వెయ్యికి పైగా ఉన్న పంచాయితీల సంఖ్య 2298 అన్నారు. కార్యక్రమంలో ఉన్నమట్ల మునిబాబు, ఆచంట మండల కన్వీనర్ పిల్లి రుద్రప్రసాద్, పెనుగొండ మండల కన్వీనర్ గుడాల నాగేశ్వరరావు, పెనుమంట్ర మండల కన్వీనర్ జంగ రాజాబాబు, పోడూరు మండల కన్వీనర్ ఎం మహేష్, అంబేద్కర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు సుంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు.
వాహన సేవలకు శరవేగంగా ఏర్పాట్లు
ద్వారకాతిరుమల, అక్టోబర్ 14: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన ద్వారకాతిరుమల క్షేత్రంలో శుక్రవారం నుంచి జరగనున్న ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాల నిమిత్తం వాహన సేవలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించే శ్రీవారి తిరు కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సకల ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని వాహన శాలలో ఉన్న స్వామివారి వాహనాలను ముస్తాబుచేసే పనులను సిబ్బంది చురుకుగా చేపట్టారు. ఇందులో భాగంగా సూర్య, చంద్రప్రభ వాహనాలను, అలాగే సింహ, హంస, గజ, రాజాధిరాజ వాహనాలతోపాటు తొళక్క వాహనాలను సిబ్బంది మెరుగులు దిద్దుతున్నారు. చిన వెంకన్నకు బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చిన వెంకన్న ఉభయ దేవేరులతో కలిసి ఈ వాహనాలపైనే క్షేత్ర పుర వీధుల్లో సంచరిస్తారు. ఈ వాహన సేవలు భక్తులకు నేత్రపర్వం కానుంది.