పశ్చిమగోదావరి

గడువులోగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 12: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగానే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహిక మండలి సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి అందిన దరఖాస్తుల పరిష్కారంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ సింగిల్ విండో పథకం కింద జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఇంతవరకు 2 వేల 614 దరఖాస్తులు అందాయని, వీటిలో2 వేల 568 దరఖాస్తులు పరిష్కరించినట్టు చెప్పారు. నిబంధనల మేరకు లేని 42 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. మిగిలిన 4 దరఖాస్తులలో నిబంధనలకు అర్హత కలిగిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి 5 సంస్థలకు భూముల కేటాయింపు చేసినప్పటికీ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ అధికారుల నిర్లిప్తతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గత వారంలో18 పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు మంజూరు చేసినట్టు చెప్పారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడి సబ్సిడీ కింద రూ.37 లక్షలు, విద్యుత్ సబ్సిడీ కింద రూ.27 లక్షలు, వాణిజ్య పన్నుల సబ్సిడీ కింద రూ.61 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ పి ఏసుదాసు, ఎల్‌డిఎం సూర్యారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రంగ లక్ష్మీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.