పశ్చిమగోదావరి

తీరవాసులను అప్రమత్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, డిసెంబర్ 14: వాయుగుండ ప్రభావం నేపథ్యంలో తీర ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ వద్ద తహసీల్దారు శ్రీపాద హరినాధ్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగాళఖాతంలో వాయుగుండ ప్రభావం వలన తీరంలో గంటకు 70 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం పొంచి ఉన్నందున తీర గ్రామాల్లో ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వాయుగుండం తుపానుగా మారే ప్రమాదం ఉందని, దాని వల్ల వర్షాలు కూడ కురుస్తాయన్నారు. తుపాను రాక ముందే అధికారులు ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తీరంలో గల సెల్ టవర్లు 24గంటలూ పనిచేసేలా అధికారులు చూడాలని, అవసరమైతే వాటి నిర్వహణకు జనరేటర్లను కూడ ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రజలకు ముందుగా బియ్యం, కందిపప్ప వంటనూనెను డీలర్ల నుండి ఇప్పించేందుకు తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ తుపాను హుదూద్, తిత్లీ కంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేశారన్నారు. తుపాను ప్రత్యేకాధికారిగా డీపీవో నాగార్జునను నియమించామని, అధికారులంతా ఆయన పరిధిలోకి వెళ్లి పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో జి రాజేంద్రప్రసాద్, నరసాపురం సీఐ ఎం సుబ్బారావు, ఎస్సై మదీనాబాషా తదితరులు పాల్గొన్నారు.
108 రాకతో సంబరాలు
వీరవాసరం, డిసెంబర్ 14: వీరవాసరం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తల రెండు సంవత్సరాల కృషి ఫలితంగా నూతన 108 వాహనం రావడంతో శుక్రవారం గ్రామస్థులకు మిఠాయిలు పంచారు. వీరవాసరం మండలానికి 108 వాహనం గతంలో మంజూరైంది. అయితే వచ్చిన ఆ వాహనాన్ని వేరే ప్రాంతానికి తరలించడంతో గత రెండు సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తలు నకెళ్ల శివరామకృష్ణ, వేండ్ర దివాకర్ అనేక పోరాటాలు చేశారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో 108 కోసం ఫిర్యాదు చేయడం, నిరాహార దీక్షలు చేపట్టడం కూడా జరిగాయి. ఇటీవల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో వీరవాసరం పీహెచ్‌సీ గీతకు సుమారు 50 మంది యువకులు వినతిపత్రం కూడా అందజేశారు. అలాగే జిల్లా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు శుక్రవారం నూతన 108 వాహనం రావడంతో గ్రామానికి చెందిన యువకులు ఉత్సాహంగా వాహనం వద్దకు చేరుకుని గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్, కొణితివాడ మాజీ సర్పంచ్ యరకరాజు చినబాబులను సామాజిక కార్యకర్తలతోపాటు గ్రామస్థులు అభినందించారు. 108 సిబ్బందితోపాటు పీహెచ్‌సీ సిబ్బందికి కూడా యువకులు స్వీట్లు పంచారు. కార్యక్రమంలో గండి దుర్గా మహేష్, నూకల కిరణ్‌కుమార్, కొండ్రెడ్డి నారాయణ గిరీష్, బంగారు మణికంఠ, రెడ్డి రాంబాబు, కొటికలపూడి బాబి, జి రవికుమార్, గూడవల్లి నరేష్, మల్లెల ఏసుబాబు, డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.