పశ్చిమగోదావరి

పాపం రేషన్ డీలర్లు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, మే 6: రేషన్ డీలర్లు తాళ్లపూడి మండలంలో అధికారులు విధించిన లక్ష్యాలు సాధించడానికి ఇంటి బాట పట్టారు. ప్రతి నెలా 5వ తేదీ లోగా రేషన్ సరకులు పంపిణీ నూరుశాతం పూర్తిచేయాలని అధికారులు ఆదేశించడంతో రేషన్ తీసుకోని వినియోగదారుల ఇళ్లకు డీలర్లు తూకం, వేలిముద్రల మిషన్లు తీసుకెళ్తున్నారు. అధికారులు లక్ష్యాల్లు నిర్ణయిస్తుంటే వినియోగదారులు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని డీలర్లు వాపోతున్నారు. వీధి బాటలో వినియోగదారుల నుండి కేవలం వేలిముద్రలు సేకరించి, పంపిణీని రికార్డుల పరంగా పూర్తి చేస్తున్నారు. దీనివల్ల రేషన్ సరకులు వినియోగదారులకు తర్వాత రోజు పంపిణీ చేసే పరిస్థితి నెలకొంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు రేషన్ పూర్తిస్థాయిలో అందే అవకాశం లేదు. టార్గెట్ల పేరుతో అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం వినియోగదారులకు పరోక్షంగా నష్టాన్ని కలిగిస్తోంది. ఇలావుండగా టార్గెట్లు పూర్తి చేసుకునే నేపధ్యంలో డీలరువద్ద ఉన్న సరకులు నిల్వలు పేరుకుపోవడం, విజిలెన్సు దాడుల్లో ఆ నిల్వలను తేడాగా చూపించి కేసులు నమోదు చేయడం పట్ల డీలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.