పశ్చిమగోదావరి

22 వరకు సరుకుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 20: అకాల వర్షాల కారణంగా చౌకధరల దుకాణాల నుంచి పంపిణి చేసే సరుకులను వినియోగదారులు తీసుకునే గడువును ఈనెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు ఇంకా సరుకులు తీసుకోలేదని తెలిసిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 22వ తేదీ వరకు చౌకడిపోల్లో వీటిని పొందేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డీలర్లు అందరూ 22వరకు వినియోగదారులకు పంపిణి చేయాల్సిన సరుకులను అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.

గజదొంగ అరెసు

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 20: ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు షేక్ నజీర్. ఇతనిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపాన్న ఉన్న ముమ్మిడివరం గ్రామం. నజీర్ ఇప్పటివరకు సుమారు 70 చోరీ కేసుల్లో నేరం రుజువై, సుమారు 15 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. చర్లపల్లి, రాజమండ్రి సెంట్రల్ జైల్, భీమవరం, తణుకు, కొవ్వూరు, అమలాపురం సబ్ జైళ్లల్లో తన శిక్ష కాలాన్ని పూర్తిచేయడం జరిగింది. అయితే కొద్దికాలంగా పశ్చిమగోదావరి జిల్లాలో చోరీలు ఊపందుకున్నాయి. దీంతో పోలీసులు దీనిపై నిఘా పెట్టారు. ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న షేక్ నజీర్‌ను భీమవరం టూటౌన్ సిఐ ఎం రమేష్‌బాబు ఆధ్వర్యంలో క్రైమ్ ఎస్సై పిఎస్ విష్ణుమూర్తి తన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ జిలానీ, కానిస్టేబుల్ బాలాజీ, బాబూరావులతో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఒక్క భీమవరంలోనే కాకుండా కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తూర్పుగోదావరి ఆలమూరు వంటి ప్రాంతాల్లో చోరీల వివరాలను బహిర్గతం చేశాడు. దీంతో ఎక్కడెకక్కడా నజీర్ దొంగతనాలు చేశాడో వివరాలు సేకరించి, శుక్రవారం అరెస్టు చేసినట్లు భీమవరం టూటౌన్ సిఐ ఎం రమేష్‌బాబు విలేఖర్ల సమావేశంలో చెప్పారు. అతని వద్ద నుండి ద్విచక్రవాహనంతోపాటు బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని వివరించారు. ఈ కేసులు మాత్రమే కాకుండా కొవ్వూరు, తణుకు, పాలకొల్లు, నిడదవోలు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతనిపై కేడీ షీట్ కూడా ఉందని తెలిపారు.